ప్రభుత్వ అంతర్గత విషయాలను లీక్ చేస్తోంది ఎవరు? సర్కార్‌లో నెంబర్ 2 ఎవరు?
తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత లీకుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒకే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి.

తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత లీకుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒకే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. తమ శాఖకు సంబంధించిన విషయాలను పక్క మంత్రులే కావాలని లీక్ చేస్తూ, తమను ఇరకాటంలో పెడుతున్నారని కొండా సురేఖ నేరుగా ఆరోపణలు చేయడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
ఈ నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ టాక్ షోలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అంశాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మంత్రుల మధ్య ఎలాంటి కుట్రలు లేవని, ప్రభుత్వం అంతా ఏకతాటిపైనే ఉందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే, తనపై వస్తున్న లీకుల ఆరోపణలను ఆయన సున్నితంగా కొట్టిపారేస్తూనే, కొన్ని అంతర్గత పరిణామాలు వాస్తవమే అన్నట్లుగా మాట్లాడటం గమనార్హం. ప్రజాప్రభుత్వంలో పారదర్శకత ఉంటుందని, అంతర్గత విషయాలు బయటకు రావడం వెనుక ఎలాంటి కుట్రలు లేవని స్పష్టం చేశారు. కొండా సురేఖ ఆవేదనపై స్పందిస్తూ.. కేబినెట్ సహచరుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఒకరి శాఖల్లో మరొకరు జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
