Telangana Assembly Sessions: దేశంలోని వెయ్యి యూనివర్సిటీల్లో బాసర ఐఐఐటీకి 36వ ర్యాంకు: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి
elangana Assembly Sessions: నిర్మల్ జిల్లాలోని బాసర ఐఐఐటీలో సీట్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ...
Telangana Assembly Sessions: నిర్మల్ జిల్లాలోని బాసర ఐఐఐటీలో సీట్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో తెలిపారు. బుధవారం అసెంబ్లీ బడ్జె్‌ట్ సమావేశాల సందర్భంగా ఆమె సభలో ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించిన వారికి బాసర ఐఐఐటీలో ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ క్యాంప్‌లో 272 ఎకరాల్లో నిర్మితమై ఉందని, ఇక్కడ విద్యార్థుల అవసరాల కోసం పోస్టాఫీసు, బ్యాంకులతో పాటు 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాసర ఐఐఐటీలో మెరుగైన విద్యను అందిస్తున్నామిన, ఇందుకు నిదర్శనం దేశంలోని వెయ్యి యూనివర్సిటీల్లో బాసర ఐఐఐటీకి 36వ ర్యాంకు రావడమేనని అన్నారు. 50 నుంచి 55 శాతం విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. బాసర ఐఐఐటీకి చెందిన 220 మంది విద్యార్థులు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ శాఖల నియమాకాల్లో ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలో మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకుని 1500 మందికి ప్రవేశాలు కల్పించామని, యూనివర్సిటీ ఏర్పడిన తొలి రోజుల్లోనే 2 వేల మంది విద్యార్థులుకు ప్రవేశం కల్పించామని అన్నారు.
ఇవీ చదవండి: Telangana Corona Effect: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..
PAN Aadhaar: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ పని చేయకపోతే వెంటనే చేసుకోండి.. గడువు ముగిసిందంటే ఇక అంతే..