TSRTC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభ.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే
ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యధాతథంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నటువంటి పీఆర్‌సీ ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. మరోవైపు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కూడా ఆర్టీసీ వీలనంపై స్పందించారు. గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉండగా ఈ సంస్థను గట్టెక్కించేందుకు చాలావరకు కృషి చేశామని పేర్కొన్నారు.

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల వీలిన బిల్లుపై శాసనసభ ఆమోదించింది. గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు బిల్లుక ఆమోదం తెలపడంతో ఈ విలీన ప్రక్రియకు మార్గం సుగమమైంది. అనంతంరం రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇందుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యధాతథంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నటువంటి పీఆర్‌సీ ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. మరోవైపు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కూడా ఆర్టీసీ వీలనంపై స్పందించారు. గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉండగా ఈ సంస్థను గట్టెక్కించేందుకు చాలావరకు కృషి చేశామని పేర్కొన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ కూడా దీనిపై స్పందించారు. ఆర్టీసీ వీలినం బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్ తమిళిసైకి ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని.. కానీ కాలక్రమేనా రాష్ట్రంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. నేను కూడా రవాణాశాఖ మంత్రిగా పనిచేశానని తెలిపారు. అప్పటిరోజుల్లో ఆర్టీసీ 14 కోట్ల రూపాయల్లో నష్టాల్లో ఉండేదని అన్నారు. అయితే ఆ నష్టాన్ని పూడ్చి.. వివిధ ప్రక్రియల ద్వారా మరో 14 కోట్ల వరకు ఆదాయం తీసుకొచ్చామని చెప్పారు. మరోవైపు డీజిల్ ధర కూడా పెరగడం ఆర్టీసీకి పెనుభారంగా మారిందని అన్నారు. ఆర్టీసీలో ప్రతిరోజూ 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారని.. ఈ పరిస్థితిపై కేబినెట్‌లో కూడా 5 గంటల పాటు చర్చించామని పేర్కొన్నారు. ఇక చివరికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏ పని చేసినా కూడా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని.. యువ ఐఏఎస్ అధికారులను నియమించి ఆర్టీసీ సంస్థను గాడిలో పెడతామని అన్నారు.




అలాగే ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొంతమంది విమర్శలు చేశారని.. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా ఆర్టీసీని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే బస్‌స్టేషన్లను కూడా ఆధునికీకరిస్తామని.. ఇంకా అవసరమైతే మరికొంత భూమిని కూడా సేకరిస్తామని చెప్పారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ కూడా ఇస్తామని.. ఉద్యోగ భద్రత వస్తుందని వాళ్లు కూడా సంతోషపడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే గవర్నర్ తమిళిసై పనిలేని పని పెట్టుకుని 96 క్లారిఫికేషన్లు అడిగారని.. చివరికి గవర్నర్ గారికి జ్ఞానోదయమై ఆర్టీసీ బిల్లును ఆమోదించారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు తరపున, నా తరపున గవర్నర్ తమిళిసై గారికి ధన్యవాదాలు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బిల్లు శాసన సభలో పాస్ కావడంతో ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
