అయ్యో దారుణం.. శివుడు పంపాడని చెప్పి తిరిగి బతికిస్తానంటూ వృద్ధురాలిని హత్య చేసిన వృద్ధుడు
ఒక వృద్ధుడు తనను శివుడు పంపాడు అని చెప్పి.. తిరిగి బతికిస్తాను అని ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే 60 ఏళ్ల వయసున్న ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించాడు. అలా నడిచి వెళ్తుండగా మార్గమధ్యలో అతనికి 85 ఏళ్ల వయసున్న కల్కీ బాయి అనే వృద్ధురాలు కనిపించింది.

ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ కొంతమందిలో మాత్రం ఇప్పటికీ మూఢనమ్మకాలు బలంగా పాతుకుపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఢా నమ్మకాలను ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వీటిపై పలువురు అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది మాత్రం వాటిని వీడటం లేదు. తాజాగా ఒక వృద్ధుడు తనను శివుడు పంపాడు అని చెప్పి.. తిరిగి బతికిస్తాను అని ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే 60 ఏళ్ల వయసున్న ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించాడు. అలా నడిచి వెళ్తుండగా మార్గమధ్యలో అతనికి 85 ఏళ్ల వయసున్న కల్కీ బాయి అనే వృద్ధురాలు కనిపించింది. దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్తున్నటువంటి ఆ వృద్ధురాలితో ప్రతాప్ సింగ్ మాటలు కలిపాడు.
ఆమె పక్కన కూర్చొని తాను శివుడి అనుచరుడినని చెప్పాడు. ఆమె కోసం తనను శివడే పంపించాడని చెప్పాడు. నువ్వు రాణివని.. చంపి తిరిగి బతికిస్తానంటూ ఆమెతో అన్నాడు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆ వృద్ధురాలి కడుపులో బలంగా గుద్దాడు. అయితే పక్కనే ఉన్న ఒక వ్యక్తి ప్రతాప్ సింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా అతడు వినలేదు. నేలపై పడిపోయిన ఆమె తలపై తన చేతిలో ఉన్న గొడుగుతో బలంగా కొట్టాడు ప్రతాప్ సింగ్. దీంతో ఆ దెబ్బలు తాళలేక ఆ వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణం జరుగుతుండగా అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన తెలయడంతో అక్కడ స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.




కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆ వృద్ధురాలు మంత్రగత్తెగా అనుమానం వ్యక్తం చేయడంతో ప్రతాప్ సింగ్ ఆమెను హత్య చేసినట్లు ప్రచారం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఆ వదంతులను ఖండించారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు తాను శివడి అవతామనే భ్రమలో ఉన్నాడని చెప్పారు. తిరిగి బతికిస్తానంటూ చెప్పి ఆ వృద్ధురాలిపై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏది ఏమైన ఓ వృద్ధురాలిని అలా దారణంగా హత్య చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.