Sri Ram Portrait: ఉప్పొంగిన భక్తిభావం.. రూబిక్స్ క్యూబ్స్‌తో శ్రీరాముడి చిత్రపటం
క్యూబ్స్ తో తయారుచేసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. విభిన్న ఆలోచన భక్తికి అద్దం పడుతుంది. భక్తిభావం ఉప్పొంగితే కొత్త కొత్త ఆద్యాత్మిక ఆలోచనలు రేకెత్తుతాయి. రూబిక్స్ క్యూబ్స్ తో చిన్న చిన్న చిత్రాలను తయారు చేయడం సాధారణంగా జరిగేదే. వందల్లో క్యూబ్స్ వినియోగించి చిత్రాలు రూపొందిస్తే వాటి రూపాలు చూడముచ్చటగా కనిపిస్తుంటాయి. మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలకు చెందిన భార్యభర్తలు నిహారిక,ఆనంద్ తమకు..
మంచిర్యాల, జనవరి 22: క్యూబ్స్ తో తయారుచేసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. విభిన్న ఆలోచన భక్తికి అద్దం పడుతుంది. భక్తిభావం ఉప్పొంగితే కొత్త కొత్త ఆద్యాత్మిక ఆలోచనలు రేకెత్తుతాయి. రూబిక్స్ క్యూబ్స్ తో చిన్న చిన్న చిత్రాలను తయారు చేయడం సాధారణంగా జరిగేదే. వందల్లో క్యూబ్స్ వినియోగించి చిత్రాలు రూపొందిస్తే వాటి రూపాలు చూడముచ్చటగా కనిపిస్తుంటాయి. మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలకు చెందిన భార్యభర్తలు నిహారిక,ఆనంద్ తమకు ఆలోచన రాగానే ఆచరణలోకి తీసుకువచ్చి వినాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి, శ్రీ రామచంద్రుడి చిత్రాలను వందలాది రూబిక్స్ క్యూబ్స్ తో తయారుచేసి అబ్బురపరస్తున్నారు. 600 రూబిక్స్ క్యూబ్స్ ఉపయోగించి శ్రీరామచంద్రుడి చిత్రాన్ని తయారు చేశారు. చైనా దేశంలో 85794 క్యూబ్స్ తో ఆర్ట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
ఈ ఆలోచన వీరిలోనూ స్ఫూర్తిని నింపింది. రామమందిరాన్ని 101116 రూబిక్స్ క్యూబ్స్ తో నిర్మించాలని తలచారు.లక్ష క్యూబిక్స్ అంటే ఖర్చు చాలా అవుతుంది.అందుకు దంపతులు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు. విరాళాల సేకరణ పూర్తికాగానే రామమందిర నిర్మాణ చిత్రాన్ని క్యూబ్స్ తో తయారుచేయాలని సంకల్పించారు.దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.