BRS: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌.. ఆ నియోజకవర్గాలే టార్గెట్..

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌పై దృష్టి సారించింది. కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది.

BRS: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌.. ఆ నియోజకవర్గాలే టార్గెట్..
Brs
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 22, 2024 | 9:30 AM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌పై దృష్టి సారించింది. కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది.

హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరిగింది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలతో బీఆర్ఎస్ అధిష్టానం తరపున మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమీక్ష జరిపారు. అభివృద్ధి రాజకీయాలకు మద్దతుగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని బీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడ్డారు.

తనకు బీఆర్‌ఎస్‌ తరపున సికింద్రాబాద్‌ లేదా మల్కాజ్‌గిరి నుంచి టికెట్‌ రావొచ్చంటున్నారు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌. కాంగ్రెస్‌ చెప్పేదొకటి చేసేదొకటని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. ఓ పక్కన అదానీని విమర్శిస్తూనే అదే అదానీతో పెట్టుబడులు తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సలహాదారుల నియామకం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని బీఆర్‌ఎస్‌ విమర్శించింది. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరిలో ఈ సారి విజయం బీఆర్‌ఎస్‌దే అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.