Telangana: పదో తరగతి తరహాలోనే ఇంటర్‌లో గ్రేడ్లు ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్

పదో తరగతి తరహాలోనే ఇంటర్మీడియట్‌లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సర్కార్‌ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి.

Telangana: పదో తరగతి తరహాలోనే ఇంటర్‌లో గ్రేడ్లు ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్
Students
Follow us
Aravind B

|

Updated on: May 11, 2023 | 12:16 PM

పదో తరగతి తరహాలోనే ఇంటర్మీడియట్‌లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సర్కార్‌ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్‌, నీట్‌ ర్యాంకుల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్‌కూ కూడా శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్‌లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? అని అధికారులు ఆలోచిస్తున్నారు. వీటికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తున్నారు.

రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదని.. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్‌ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదైనా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంటర్‌ మార్కుల కంటే జేఈఈ, నీట్‌ ర్యాంకులు వస్తాయో?రావో? అన్న దానిపైనే విద్యార్థులు అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నానో అకాడమీ సంచాలకుడు కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..