Telangana: తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురుపై వ్యామోహం పెంచుకున్న వ్యక్తి .. చివరికి ఏం జరిగిందంటే
ఈ మధ్య కాలంలో కూతురు వరుస అమ్మాయిలను.. చెల్లి వరుస అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటి దారుణమే ఇటీవల మేడ్చల్ జిల్లా కండ్లకోయలో చోటుచేసుకుంది. ఒక మహిళతో సహజీవనం చేస్తూ.. ఆ మహిళ యొక్క కూతురిపై లైంగిక వాంఛ పెంచుకున్న వ్యక్తి చివరకి మైనర్ బాలిక చేతిలో దెబ్బలు తిని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన జయ శ్రీ నాయక్ అనే మహిళ ఉంటోంది.
ఈ మధ్య కాలంలో కూతురు వరుస అమ్మాయిలను.. చెల్లి వరుస అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటి దారుణమే ఇటీవల మేడ్చల్ జిల్లా కండ్లకోయలో చోటుచేసుకుంది. ఒక మహిళతో సహజీవనం చేస్తూ.. ఆ మహిళ యొక్క కూతురిపై లైంగిక వాంఛ పెంచుకున్న వ్యక్తి చివరకి మైనర్ బాలిక చేతిలో దెబ్బలు తిని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన జయ శ్రీ నాయక్ అనే మహిళ ఉంటోంది. ఆమె గత కొంత కాలంగా పద్మనాభ నాయక్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది. కొన్ని వారాల క్రితం జయశ్రీ నాయక్ యొక్క కూతురు తమ సొంత ఊరు నుంచి కండ్లకోయకు వచ్చింది. అయితే ఆ మైనర్ బాలిక వచ్చినప్పటి నుంచి పద్మనాభ నాయక్ ప్రవర్తన పూర్తిగా మారింది. అతడు చాలాసార్లు ఆ బాలికతో చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. మీద చేతులు వేసేందుకు కూడా ప్రయత్నించేవాడు. ఒకటి రెండు సార్లు ఆ బాలిక, తన తల్లి జయ శ్రీ నాయక్ కూడా పద్మనాభ నాయక్‌ను హెచ్చరించారు. అయితే అతను మాత్రం కూతురుగా భావిస్తున్నాను అంటూ వారికి చెప్పాడు.
అయితే ఈనెల 8వ తేదిన మధ్యాహ్నం సమయంలో జయశ్రీ నాయక్ పనికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె కూతురు మాత్రమే ఇంట్లో ఉంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పద్మనాభ నాయక్.. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ బాలిక వద్దు వద్దు అంటూ ఎంత వారించినా కూడా లైంగికంగా దాడి చేసేందుకు యత్నించాడు. చివరికి ఆ బాలిక చేతికి అందిన కర్రతో పద్మనాభ నాయక్ పై కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో జయశ్రీ నాయక్ లంచ్ బ్రేక్ సమయంలో ఇంటికి వచ్చింది. రక్తపు మడుగులో పద్మనాభ నాయక్ పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. చివరికి చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితురాలు మైనర్ బాలిక కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..