Telangana: అధికారులు అలా.. బీఆర్ఎస్ నేతలు ఇలా.. మోదీ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరుపై వీడిన ఉత్కంఠ

శనివారం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారనుంది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు, మరికొన్ని పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకుననట్లు తెలుస్తోంది..

Telangana: అధికారులు అలా.. బీఆర్ఎస్ నేతలు ఇలా.. మోదీ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరుపై వీడిన ఉత్కంఠ
Modi Hyderabad Tour
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 07, 2023 | 3:02 PM

శనివారం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారనుంది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు, మరికొన్ని పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరుకావొద్దని నిర్ణయించినట్లు సమాచారం. అధికారిక ఆహ్వానం అందినా వెళ్లొద్దని ముఖ్యమంత్రి తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శనివారం ఉదయం ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న విషయం తెలిసిందే.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందే భారత్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ హెడ్యూల్‌లో కేసీఆర్‌ పేరుతో ఆహ్వానం ఉండడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.37 గంటలకు వరకు 7 నిమిషాల పాటు కేసీఆర్‌ మాట్లాడేందుకు సమయం కూడా కేటాయించారు. అయితే మోదీతో వేదిక పంచుకునేందుకు కేసీఆర్‌ ససేమిరా అన్నట్లు సమాచారం.

గతంలోనూ..

ఇదిలా ఉంటే గతంలో మోదీ హైదరాబాద్‌కు వచ్చిన పలు సందర్భాల్లో కేసీఆర్‌ మోదీని కలవలేదు. తొలిసారి కరోనా సమయంలో కరోనా వ్యాక్సిన్‌ పరిశీలనకు జీనోమ్ వ్యాలీకి మోదీ వచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ వస్తానని చెప్పినా పీఎమ్‌ఓ ప్రోటోకాల్‌ పేరుతో అనుమతి నిరాకరించింది. దీంతో నాడు లేని ప్రోటోకాల్‌ ఇప్పుడెందుకు అని బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత మోదీ మరో మూడుసార్లు హైదరాబాద్ వచ్చినా కేసీఆర్‌ ఆయనతో వేదిక పంచుకోలేదు. ఇదిలా ఉంటే శనివారం రేపు ప్రధానిని ఆహ్వానించేందుకు మంత్రి తలసాని ప్రభుత్వం తరఫున వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

కేసీఆర్‌ వెళ్లడం లేదు..

ఇదిలా ఉంటే రేపు మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్‌ వెళ్లడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మోదీ చూపిన బాటలోనే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ ను స్వాగతం పలికేందుకు రావద్దని మోడీ చెప్పారని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రోటోకాల్ ను పట్టించుకోలేదన్న వినోద్‌ కుమార్‌.. కేసీఆర్ ను మోడీ అవమానించారని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..