Telangana: తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట.. కాళేశ్వరంపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..
కాళేశ్వరం మూడో దశకు లైన్ క్లియరైంది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇంతకీ, సుప్రీం ఇచ్చిన ఊరట ఏంటి?. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది?
కాళేశ్వరం మూడో దశకు లైన్ క్లియరైంది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇంతకీ, సుప్రీం ఇచ్చిన ఊరట ఏంటి?. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం.. కాళేశ్వరం మూడో టీఎంసీ భూసేకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కీలక ఉత్తర్వులిచ్చింది సుప్రీంకోర్టు. గతంలో ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వుల్లో సవరణలు చేసింది. తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా వెలుసుబాటు కల్పించింది. మూడో టీఎంసీ కోసం అనుమతులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న విజ్ఞప్తులను పరిశీలించేందుకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి కూడా అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వమిచ్చే నష్టపరిహారం తీసుకొని భూములు ఇవ్వాలనుకునే రైతులకు కూడా పర్మిషన్ ఇచ్చింది సుప్రీం. కాళేశ్వరం మూడో టీఎంసీ భూసేకరణపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో పనులకు బ్రేక్ పడింది. భూములిచ్చేందుకు నిరాకరిస్తూ రైతులు సుప్రీంను ఆశ్రయించడంతో స్టేటస్‌కో ఇచ్చింది కోర్టు. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులకు అసలు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతుల్లేవంటూ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. దాంతో, గతంలో స్టేటస్‌కో ఉత్తర్వులిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.
అయితే, రాజకీయ కారణాలతోనే కాళేశ్వరానికి అడ్డుపడుతున్నారంటూ ఇప్పుడు వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. స్టేటస్‌కో ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని కోరింది. స్టేటస్‌కో కారణంగా పర్యావరణ అనుమతులు ఆలస్యం అవుతున్నాయంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తెలంగాణ ప్రభుత్వానికి ఊరట కల్పిస్తూ సవరణలు చేసింది. అయితే, తుది తీర్పునకు లోబడే అనుమతులు ఉంటాయని స్పష్టంచేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..