BRS: బీఆర్ఎస్ పార్టీకి తమిళనాడు నాడార్ సంఘాల మద్ధతు.. ఆ సమావేశానికి రావాలంటూ సీఎంకు ఆహ్వానం..
భారత రాష్ట్ర సమితి పార్టీ ఓవైపు దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు వివిధ రాష్ట్రాల ప్రజా సంఘాల నుంచి అనూహ్య మద్ధతు లభిస్తోంది.
భారత రాష్ట్ర సమితి పార్టీ ఓవైపు దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు వివిధ రాష్ట్రాల ప్రజా సంఘాల నుంచి అనూహ్య మద్ధతు లభిస్తోంది. ఇప్పటికే ఏపీలో అడుగుపెట్టిన బీఆర్ఎస్కు ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా మద్ధతు లభించింది. తాజాగా తమిళనాడు నాడార్ సంఘాలు బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు తెలిపాయి. తెలంగాణలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమిళనాడులోనూ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిశారు.
తమిళనాడులో నాడార్లను ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుంటున్నారని ఆవేదన చెందారు నాడార్ నాయకులు. తెలంగాణలో గౌడ, ఈడిగ కులస్తులకు అందించే సంక్షేమం, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శనంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని తమ ఆకాంక్షను వెల్లడించారు నాడార్ నేతలు. తెలంగాణలో మాదిరిగా తమిళనాడులోనూ కుల, చేతి వృత్తులను ప్రోత్సహించాలని వారు కోరారు. తెలంగాణలో కుల వృత్తులకు పూర్వవైభవం వచ్చిందని, దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర తరహా పథకాలు అమలు కావాలన్నారు నాడార్ సంఘం నేతలు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి క్రమంగా మద్ధతు పెరుగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చి మద్ధతు తెలుపుతున్నారు వివిధ సంఘాల ప్రతినిధులు. ఈ క్రమంలోనే త్వరలోనే చెన్నైలో జరుగనున్న నాడార్ కుల సంఘాల సమావేశానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు సంఘం ప్రతినిధులు. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌ను కలిసి మద్ధతు తెలిపేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు నాడార్ సంఘం ముఖ్య నేతలు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు నాడార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ అరసు, అల్ ఇండియా తమిళనాడు నాడార్ సంఘం ప్రధాన కార్యదర్శి ముత్తు రమేష్, అల్ ఇండియా తమిళనాడు నాడార్ సంఘం ఆర్గనైజర్, తమిళనాడు నాడార్ సంఘం ప్రధాన కార్యదర్శి బాల కృష్ణన్, తమిళ నాడు నాడార్ సంఘం కోశాధికారి జ్ఞాన గౌతమ పాండియన్, తమిళనాడు నాడార్ సంఘాల కోఆర్డినేటర్ శశికాంత్, నాడార్ సంఘం సమన్వయకర్త కడకరై కార్తీకన్, వీరాకుమార్, నాడార్ సంఘం అధ్యక్షులు, ఎన్డిఆర్ ఫౌండేషన్ మహారాష్ట్ర అధ్యక్షుడు పువణేష్ నాడార్, తైవ కుమార్ నాడార్ తమిళనాడు సంఘం మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..