AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆ రోజుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది మరింత సమయం కోరడంతో.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. న్యాయస్థానం..! అయితే..

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఆ రోజుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
Sc Adjourns Brs Mla Poching Case To On Feb 27
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 17, 2023 | 9:09 PM

Share

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.! ఈ రోజు(ఫిబ్రవరి 17) ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది.! ఇరు వర్గాలూ తమ వాదనలు వినిపించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది మరింత సమయం కోరడంతో.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. న్యాయస్థానం..! అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు CBIకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీం కోర్టు తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 8న విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును నేడు విచారించనున్నట్లు ప్రకటించారు. అ క్రమంలోనే పిటిషన్‌పై ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్ దుష్యంత్‌ దవే, BJP తరఫున మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఈ కేసు చాలా తీవ్రమైనదని..ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని నష్టం కలిగించేదని చెప్పారు దవే.

అయితే స్వయంగా CM కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో మీడియకు వివరాలు లీక్‌ చేశారని ఆరోపించారు జఠ్మలానీ. మరి CBI, ఈడీ ఇస్తున్న లింక్‌ల మాటేంటని ప్రశ్నించిన దవే.. ఈ కేసుకు సంబంధించి ఇంకా అనేక ఆధారాలు తమ ఉన్నాయని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..BJPకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నప్పుడు.. CBIకి అప్పగిస్తే.. విచారణ ఎలా జరుగుతుందో ఊహించవచ్చన్న దవే.. తనకు మరింత సమయం కావాలని కోరారు. ఇద్దరి వాదనలు విన్న బీఆర్ గవాయ్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.ఆ రోజు కోర్టు జాబితాలో ఉన్న అన్ని కేసులు ముగిసిన తర్వాతే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అటు కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే CBI పలుమార్లు CSకు లేఖలు రాసింది. అయితే సుప్రీం తీర్పు వచ్చేంత వరకు దాన్ని అలాగే పెండింగ్‌లో ఉంచాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది.

కాగా, ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఇష్యూపై BJP-BRS నేతల మధ్య డైలాగ్‌ వార్‌ కూడా ఓరేంజ్‌లో నడిచింది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలోఈ కేసుపై తీర్పు ఎలా ఉంటుందనేది అటు రాజకీయ విశ్లేషకులలో, ఇటు ఇరు పార్టీ కార్యకర్తలలోనూ ఉత్కంఠను రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..