AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Voter ID: అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా..

ప్రతిసారి ఓటర్ ఐడీని మనం వెంట తీసుకెళ్లలేము. ఒక్కోసారి ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు అవసరమైతే పని ఆగిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి.. అందుకోసమే..

Digital Voter ID: అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Digital Voter Id
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 17, 2023 | 4:13 PM

Share

భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను ఇస్తుంది. ఒక గుర్తింపు కార్డులా ఓటింగ్ కేంద్రంలోనే కాకుండా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అయితే ప్రతిసారి దానిని మనం వెంట తీసుకెళ్లలేము. ఒక్కోసారి ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు అవసరమైతే పని ఆగిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇకపై ఆ సమస్య ఎదురవకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఆధార్, పాన్ కార్డు మాదిరిగా డిజిటల్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ కాపీని ఉంచుకుని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సులభంగా వినియోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలోనూ ఈ డిజటల్ కార్డును చూపించి ఓటు వేయచ్చు కూడా.

అయితే భారత్‌లో ప్రస్తుతం 9.8 కోట్ల మంది ఓటర్లకు ఇ-ఓటర్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా 1 శాతం మంది మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకున్నారని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక మీ డిజిటల్ ఓటర్ కార్డును ఎడిట్ చేయలేని పీడీఎఫ్ ఫైల్ రూపంలో పొందవచ్చు. దీన్నే ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్‌గా పిలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక పోర్టల్‌ నుంచి దీనిని సులువుగా పొందవచ్చు. పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకున్న డిజిటల్ కార్డును ప్రింట్ తీసుకుని లామినేట్ సైతం చేయించుకుని వినియోగించుకోవచ్చు.

డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..

  • Step 1- ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  • Step 2- ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • Step 3- వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి.
  • Step 4- మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
  • Step 5- వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.
  • Step 6- ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.
  • Step 7- ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.
  • Step 8- నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ కార్డు ఉంటుంది.

మరోవైపు.. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నవారు, ఓటర్ ఐడీ లేకపోతే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్‌తో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకును ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..