Huawei Watch Buds: వావ్ అనేలా వాచ్.. అందులోనే ఇయర్ ఫోన్స్.. మామూలుగా లేవుగా ఫీచర్స్.. లాంచింగ్ ఎప్పుడంటే..
హువాయ్(Huawei) కంపెనీ ఓ అత్యాధునిక స్మార్ట్ వాచ్‌ను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? వాచ్ తో పాటు ఇయర్ బడ్స్ కూడా ఇన్ బిల్ట్ గా ఇందులో వస్తాయి.
మనిషి స్మార్ట్ అడుగులు వేస్తున్నాడు.. ఇంటా బయట ఎక్కడైనా స్మార్ట్ డివైజ్ లేనిదే నిమిషం గడవని పరిస్థితిలో ఉంటున్నాడు. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైయర్ లెస్ ఇయర్ బడ్స్ ఇలా అన్నిస్మార్ట్ డివైజ్ లనే అధికంగా వాడుతున్నాడు. ఇదే క్రమంలో కంపెనీలు కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారిని ఆకర్షించేందుకు అవసరమైన అనేక పరికరాలను అందిస్తున్నాయి. అయితే అనేక రకాల పరికరాలు మనం తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకు. మహిళలైతే తమ హ్యాండ్ బ్యాగులలో పెట్టుకొని ఎన్నైనా వస్తువులను తీసుకెళ్లగలరు. మరి పురుషులకు కాస్త ఇబ్బందే. అందుకే హువాయ్(Huawei) కంపెనీ ఓ అత్యాధునిక స్మార్ట్ వాచ్‌ను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? వాచ్ తో పాటు ఇయర్ బడ్స్ కూడా ఇన్ బిల్ట్ ఇందులో వస్తాయి. ఇక పై మీరు ప్రత్యేకంగా ఇయర్ బడ్స్ తీసుకళ్లాల్సిన అవసరం లేదు. ఇయర్ బడ్స్ మరిచిపోతాం అనే భయం కూడా అక్కరలేదు. ఈ డివైజ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇక మరిచిపోరు..
మీరు మీ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను తీసుకెళ్లడం తరచుగా మరచిపోయే వారైతే, హువాయ్ వాచ్ బడ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. వాచ్ సాధారణ స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. బెల్ట్ లెదర్‌తో వస్తుంది. దీనిలోని AMOLED స్క్రీన్ 1.43-అంగుళాలు ఉంటుంది. అలాగే దీనిలో బయటకు కనిపించని విధంగా జత వైర్‌లెస్ ఇయర్‌బడ్ లు ఉంటాయి.
ఫీచర్లు ఇవి..
ఈ గడియారం హృదయ స్పందన మానిటర్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయి కొలత వంటి అన్ని ప్రామాణిక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లతో వస్తుంది. IPX7 నీటి నిరోధకతను అందిస్తుంది. IPX4 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. హువాయ్ వాచ్ బడ్స్‌ని Huawei Health Connect యాప్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ పరికరానికి కనెక్ట్ చేయవచ్చు .
ఫుల్లీ ఆటోమేటిక్..
దీనిలోని వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు ఏ ఇయర్‌బడ్‌ను ఏ చెవిలో (ఎడమ లేదా కుడి) ధరించిందో ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి. తదనుగుణంగా వాల్యూమ్ ని సర్దుబాటు చేస్తాయి. ఇవి ట్రిపుల్ అడాప్టివ్ ఈక్యూని కూడా కలిగి ఉంటాయి. దీనిలోని మైక్రోఫోన్‌లు సెన్సార్‌లను ఉపయోగించి ఆడియో నాణ్యతను ఆప్టిమైజ్ చేస్తాయి.
బ్యాటరీ మాత్రం తక్కువే..
వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 21ఎంఎం పొడవు, 10ఎంఎం వెడల్పు, 4 గ్రాముల బరువును కలిగి ఉంటాయి. ఇది ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ను కలిగి ఉంది. అలాగే గాలి శబ్దాన్ని తగ్గిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ మాత్రం కాస్త తక్కువ సామర్థ్యం కలిగి ఉంది. నాయిస్ కేన్సలేషన్ ఆన్ చేసి ఉంటే ఇయర్ బడ్స్ కేవలం మూడు గంటలు మాత్రమే పనిచేస్తాయి. వాచ్ మాత్రం మూడు రోజుల వరకూ ఆన్ లో ఉంటుంది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. దీని ధర 449 బ్రిటిష్ పౌండ్‌లు అంటే మన రూపాయలలో చెప్పాలంటే సుమారు రూ. 44,702 ఉంటుంది. అయితే ఈ ఉత్పత్తి భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందో లేదో ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..