AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కన్నా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. గతంలోనూ ఇదే జరిగిందంటూ..

జనసేనతో పొత్తుపై ఆయన స్పందిస్తూ.. బీజేపీతోనే తాము పొత్తులో వున్నామని పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటనలో చెప్పారని సోము వీర్రాజు..

Andhra Pradesh: కన్నా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. గతంలోనూ ఇదే జరిగిందంటూ..
Somu Virraju On Kanna Lakshmi Narayana Comments
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 17, 2023 | 5:35 PM

Share

ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీని వీడుతూ.. తనపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు. శుక్రవారం బాపట్ల జిల్లా చీరాలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. కన్నా లక్ష్మీనారాయణ తనపై చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. వీటిపై గతంలోనూ తాను స్పందించలేదని, ఇప్పుడూ స్పందించాల్సిన అవసరం లేదని వీర్రాజు కుండబద్ధలు కొట్టినట్లు పలికారు. సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరిన తాను.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి స్థాయికి చేరానని ఆయన పేర్కొన్నారు. తానేంటో బీజేపీ అధిష్టానానికి తెలుసని వీర్రాజు పేర్కొన్నారు. ఇక జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. బీజేపీతోనే తాము పొత్తులో వున్నామని పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటనలో చెప్పారని సోము వీర్రాజు  గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 60శాతం వరకు నిధులు కేంద్రమే కేటాయిస్తోందని కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నిధులు తమవేనని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గురువారం తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కన్నా చెప్పారు. తన అనుచరులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయానికి ప్రకటించనున్నట్టుగా తెలిపారు.

రాజీనామాకు కారణం అదే.. 

ఇవి కూడా చదవండి

బీజేపీకి రాజీనామా  చేసిన  సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు గౌరవం ఉందని.. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని కన్నా చెప్పారు. బీజేపీలో చేరినప్పటికీ నుంచి పార్టీ అభివృద్ది కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరిని ఏకతాటిపై నడిపానని తెలిపారు.  సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని, ఆయన నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు. సోము వీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ నాయకులతో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆయన వైఖరి, వ్యవహారశైలి నచ్చకనే పార్టీని వీడుతున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలో తనతో పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలు తెలియజేశారు కన్నా లక్ష్మీనారాయణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..