Shivratri Special Trains: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి స్పెషల్‌ ట్రైన్స్ ఇవే.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే రైళ్ల వివరాలు

మహా శివరాత్రి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేసినట్లు..

Shivratri Special Trains: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి స్పెషల్‌ ట్రైన్స్ ఇవే.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే రైళ్ల వివరాలు
Maha Shivratri Special Trains
Follow us

|

Updated on: Feb 17, 2023 | 7:40 PM

మహా శివరాత్రి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైలు నెంబర్ 07489 సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య 2023, ఫిబ్రవరి 17వ తేదీన ఉంటుంది. ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటల10 నిముషాలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07490 తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య ఫిబ్రవరి 19న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 4 గంటల 35 నిముషాలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటల 25 నిముషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ స్పెషల్‌ ట్రైన్లకు సీట్ల రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఫిబ్రవరి 18న రైలు నెంబర్ 07677 హెచ్ఎస్ నాందేడ్ నుంచి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రూట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం ఉదయం 9 గంటలకు హెచ్ఎస్ నాందేడ్‌లో బయల్దేరి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 15 నిముషాలకు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ చేరుకుంటుంది. ఫిబ్రవరి 19న రైలు నెంబర్ 07678 ఢిల్లీ సఫ్దర్‌జంగ్ నుంచి హెచ్ఎస్ నాందేడ్ రూట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం రాత్రి 11 గంటలకు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌లో బయల్దేరి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిముషాలకు హెచ్ఎస్ నాందేడ్ చేరుకుంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్స్ బుక్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.