Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని.. కొడుకు యాత్రను పట్టించుకోకపోవడంతోనే అంటూ..
లోకేష్ చేస్తున్న యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబు డి ఫాల్టర్ అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. అదే క్రమంలో..

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చేస్తున్న యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబు డి ఫాల్టర్ అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. అదే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం(ఫిబ్రవరి 17) మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘లోకేష్ మూడు వారాలుగా పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు మూడు రోజులుగా తూర్పుగోదావరిలో తిరుగుతున్నారు. కొడుకు చేస్తున్న పాదయాత్రను ప్రజలు పట్టించుకోవకపోవడంతో.. బాబు డి ఫాల్టర్ అయ్యార’’ని విమర్శలు గుప్పించారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘‘కొడాలి నాని బూతులు మాట్లాడతాడని నన్ను టీడీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇవాళ లోకేష్ భాష ఎలా ఉంది.. జగన్‌ను ‘నువ్వు రాయలసీమలోనే పుట్టావా..?’ అని అడుగుతున్నారు. అదే మాట మేము అంటే గోలగోల చేస్తున్నారు. జగన్ డిఎన్ఏ రాయలసీమ.. లోకేష్ డిఎన్ఏ తెలంగాణ.. లోకేష్ తెలంగాణలో పుట్టి ఇక్కడ ఎందుకు..?’’ అని ఎద్దేవా చేశారు.
కాగా, అంతకముందు కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్ రూ.10 ఇచ్చి రూ. 100 లాక్కుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిలువు దోపిడీకి ప్రజలు బలయిపోతున్నారని.. తన జీవితంలో ఇంత దోపిడీదారున్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను ప్రజలే కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వివరించారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..