Telangana: వ్యక్తిని హత్య చేసి.. కాల్చి బూడిద చేసిన గ్రామస్తులు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన పోలీసులు
కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెంపతో ఓ వృద్దున్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి కాల్చి వేశారు గ్రామస్తులు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఉడుంపూర్ గ్రామపంచాయితీ పరిధిలో మారుమూల గ్రామం గండి గోపాల్ పూర్ లో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మంత్రాలు చేస్తున్నాడనే నెంపతో ఓ వృద్దున్ని గ్రామస్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసి కాల్చి చంపిన ఘటన నిర్మల్ జిల్లా ఉడుంపూర్ గ్రామపంచాయితీ పరిధిలో వెలుగు చూసింది. గండి గోపాల్‌పూర్‌కు దేశినేని భీమయ్య (55) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు మూతి మల్లేష్ (23), నరేష్ (21) అనే ఇద్దరు యువకులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా దట్టమైన అడవిలో కాల్చి పడేశారు. ఈ నెల 10న ఈ దారుణం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన.
పశువులను అడవిలోకి మేతకు తీసుకు వెళ్లిన స్థానిక పశువుల కాపారులకు అడవిలో బూడిద, కొంత భాగం మిగిలిన ఎముకలు కనిపించాయి. అనుమానం వచ్చి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామంలోని భీమయ్య కనిపించకుండా పోవడం అడవిలో మృతదేహాన్ని కాల్చిన ఆనవాళ్లు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానస్తులను అదుపులోకి తీసుకుని విచారించగా.. తామే హత్య చేసినట్లు నిందితులు మల్లేష్, నరేష్ లు ఒప్పుకున్నారు.
తన తల్లి అనారోగ్యానికి గురవడంతో భీమయ్యే మంత్రాలు చేశాడని బావించిన ఇద్దరు అన్నదమ్ములు.. భీమయ్యను కర్రలతో చితకబాది హత్య చేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. చనిపోయాడని నిర్దారించుకున్నాక అడవిలో చితి పేర్చి కాల్చి వేశామని తెలిపారు. దీంతో నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



