Suckermouth catfish: గోదావరిలో అడుగు పెట్టిన విదేశాల్లో ఎక్కువగా కనిపించే జీబ్రా గీతల ఎలుక మూతి చేప
ప్రకృతి మనకు తెలియని అనేక వింతలకు నిలయం. ఒకొక్కసారి అరుదైన జీవులు కనిపించి అబ్బురపరుస్తాయి. తాజాగా ఒంటిపై జీబ్రా మాదిరి గీతలతో..
Suckermouth catfish: ప్రకృతి మనకు తెలియని అనేక వింతలకు నిలయం. ఒకొక్కసారి అరుదైన జీవులు కనిపించి అబ్బురపరుస్తాయి. తాజాగా ఒంటిపై జీబ్రా మాదిరి గీతలతో.. ఎలుక మూతి ఆకారంలో ఉన్న ఓ చేప మనదేశంలోని నదుల్లో జీవిస్తుందని ఇటీవలే గుర్తించారు. ఈ చేపను సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అని అంటారు. ఇతర దేశాల్లో ముఖ్యంగా… దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీతీరంలో కనిపించే ఈ చేప మన గోదావరిలోకి చేరింది. తాజాగా తెలంగాణలోని సిరిసిల్లా ఎస్సారార్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో చేపల వేటకోసం వెళ్లిన ఓ మత్స్యకారుడుకి చిక్కింది. సిరిసిల్లకు చెందిన వంగళ నరేశ్ వలకు చిక్కిన ఈ చేపను చూడడానికి స్థానికులు బారులు తీరారు.