AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rope Way:  హైద‌రాబాద్‌లో రోప్ వే… డీపీఆర్‌లు సిద్ధం… ఏఏ మార్గాల్లో… ఎప్పుడు ప్రారంభిస్తారంటే..?

మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్‌ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్‌ నుంచి సచివాలయం, ప్యారడైజ్‌ నుంచి సచివాలయం మార్గంలో...

Rope Way:  హైద‌రాబాద్‌లో రోప్ వే... డీపీఆర్‌లు సిద్ధం... ఏఏ మార్గాల్లో... ఎప్పుడు ప్రారంభిస్తారంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 23, 2021 | 9:27 AM

Share

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల ట్రాఫిక్ క‌ష్టాల‌ను త‌గ్గించేందుకు తెలంగాణ స‌ర్కారు కృషి చేస్తోంది. న‌గ‌రంలో ఇప్ప‌టికే మెట్రో సేవ‌లు సిటీ జ‌నాల ర‌వాణాను సుల‌భ‌త‌రం చేశాయి. త్వ‌ర‌లో మ‌రో ర‌కం ర‌వాణా సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. రెండు సంవ‌త్స‌రాలుగా ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న ఇప్ప‌డు దానికో రూపం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

రోప్‌వే ర‌వాణా సౌక‌ర్యం…

ప్ర‌పంచ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే మార్గాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసే దిశగా యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాల్లో రోప్‌వే మార్గాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో రెండు కారిడార్‌లతోపాటు యాదాద్రిలో మరో కారిడార్‌ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

ఏయే ప్రాంతాల్లో..?

మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్‌ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్‌ నుంచి సచివాలయం, ప్యారడైజ్‌ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్స్, సంజీవయ్య పార్కు ఉన్నాయి. అలాగే పర్యాటకులతోపాటు భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్‌ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు.

చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.