తపశ్శక్తి పేరుతో నిలువు దోపిడీ.. అన్నదమ్ములను అడ్డంగా ముంచిన దొంగ స్వామీజీలు.. తస్మాత్‌ జాగ్రత్త!

తపశ్శక్తితో రుద్రాక్షలను మహిమాన్వితం చేస్తాం..అంటూ అమాకులను నమ్మించి నిలువు దోపిడీ చేసిన దొంగ బాబాల గుట్టు రట్టు చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు.

తపశ్శక్తి పేరుతో నిలువు దోపిడీ.. అన్నదమ్ములను అడ్డంగా ముంచిన దొంగ స్వామీజీలు.. తస్మాత్‌ జాగ్రత్త!
Follow us

|

Updated on: Jan 23, 2021 | 9:26 AM

తపశ్శక్తితో రుద్రాక్షలను మహిమాన్వితం చేస్తాం..అంటూ అమాకులను నమ్మించి నిలువు దోపిడీ చేసిన దొంగ బాబాల గుట్టు రట్టు చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు. దొంగబాబాలను నమ్మి బంగారం సమర్పించుకున్న ఇద్దరు అన్మదమ్ములు పోలీసులను ఆశ్రయించారు. బురిడీ బాబాల కోసం విస్తృత గాలింపు చేపట్టిన పోలీసులు ఆరుగురు దొంగ స్వామీజీల ముఠాను అరెస్ట్‌ చేశారు.

తిరుపతికి చెందిన రామాయణం మురళీ, విశ్వనాధ్ అనే అన్నదమ్ములు రోజూ మదనపల్లె మార్కెట్ లో టమాటాలు కొని గ్రామానికి తీసుకువెళ్లి అమ్ముకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వ్యాపారం ముగించుకుని వస్తున్న వారికి మార్గమధ్యలో ఆరుగురు స్వామీజీల బృందం కనిపించింది. వారి వస్త్రధారణ ముఖాలు చూడగానే మహిమగల స్వామీజీలు అని భావించారు. అన్నదమ్ముల మెడలో ఉన్న రుద్రాక్షలు తీసి పూజలో పెడితే హిమాలయాల్లో పొందిన జ్ఞానశక్తితో వాటిని మహిమాన్వితమైన వాటిగా చేస్తామని, తద్వారా అష్టైశ్వర్యాలు సిధ్దిస్తాయని నమ్మబలికారు.

దీంతో వారు సమీపంలోని తమ బంధువుల ఇంటికి స్వామీజీలను తీసుకువెళ్లారు. స్వామీజీలు చెప్పినట్లు 20 వేలు రూపాయలతో పూజా సామాగ్రి సమకూర్చారు. హోమ గుండం ఏర్పాటు చేశారు. పూజ మొదలెట్టారు. అన్నదమ్ముల మెడలోని బంగారు రుద్రాక్ష మాలలు పూజలో పెట్టమని చెప్పగా, తమ మెడలోని 60 గ్రాములు బంగారు రుద్రాక్ష మాలతోపాటు, 20 వేల రూపాయలను వారికి ఇచ్చి పూజలో పెట్టించారు. స్వామీజీలు హిందీలో మంత్రాలు చదువుతూ హోమం చేయసాగారు. మధ్య మధ్యలో కొబ్బరి కాయలు కొడుతూ, కుంకుమ జల్లుతూ, సాంబ్రాణి ధూపం వేస్తూ షోని రక్తి కట్టించారు. ధూపం వాసన పీల్చిన అన్నదమ్ములు స్పృహ కోల్పోయారు. ఆ సమయంలో స్వామీజీలు అందరూ ఇంట్లోనుంచి ఉడాయించారు.

అన్నదమ్ములిద్దరూ తేరుకుని చూసే సరికి స్వామీజీలు మాయం అయ్యారు. ఒరిజినల్ బంగారు రుద్రాక్ష మాల స్ధానంలో నకిలీ రుద్రాక్షమాల కనిపించింది. అక్కడ పెట్టిన డబ్బు మాయం అయ్యింది. దీంతో లబో దిబో మంటూ అన్నదమ్ములిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…నిందితులు ఉపయోగించన కారు బెంగుళూరు వెళ్లినట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 56 గ్రాముల రెండు తులసి మాలలు, నగదు, వ కారును స్వాధీనం చేసుకున్నారు.

Also Read :

Beer yoga: బీరు సేవిస్తూ యోగా.. భలే కిక్ అంటున్న యువత..ఇంతకీ ఎక్కడంటే..?

Bose Jai Hind: సుభాష్‌ చంద్రబోస్‌ అందించిన ‘జైహింద్‌’ నినాదం వెనకుంది మన హైదరాబాదీ అనే విషయం మీకు తెలుసా..?