Godman kidnap: సినీ ఫక్కీలో స్వామీజీ కిడ్నాప్.. సినిమాకు మించిన ట్విస్ట్‌లు.. చివరకు ఏం జరిగిందంటే..?
కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామీజీ కిడ్నాప్ కలకలం రేపింది. కపిలాపూర్ గ్రామం, బార్లీ జిల్లా నుంచి స్వామీజీని కిడ్నాప్ చేశారు దుండగులు. విమానంలో షిరిడి వెళ్దామని నమ్మించి..
Godman kidnap: కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామీజీ కిడ్నాప్ కలకలం రేపింది. కపిలాపూర్ గ్రామం, బార్లీ జిల్లా నుంచి స్వామీజీని కిడ్నాప్ చేశారు దుండగులు. విమానంలో షిరిడి వెళ్దామని నమ్మించి కిడ్నాపర్స్ భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి ఓ కారులో స్వామిజీని హైద్రాబాద్ తీసుకొని వచ్చారు. హైద్రాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా బెంగుళూరుకు తీసుకువెళ్లారు. ఓ గదిలో స్వామీజీని బంధించి… 20 కోట్లు నగదు, కిలో బంగారం లేకపోతే పది ఎకరాల వ్యవసాయం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన్ను గత నాలుగు రోజులుగా చిత్ర హింసలకు గురిచేశారు దుండగులు. సినీ పక్కీలో ఈ కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుంది.
తాము డిమాండ్ చేసింది ఇవ్వకపోతే స్వామి కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు కిడ్నాపర్లు. రూ. 5 కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో స్వామీజీని తిరిగి హైద్రాబాద్‌కు తీసుకోచ్చారు. హైదరాబాద్ చేరుకోగానే తనకు గుండెల్లో నొప్పి వస్తుంది అంటూ స్వామీజీ నాటకమాడారు. దీంతో కిడ్నాాపర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాను కిడ్నాప్ అయిన విషయాన్ని వైద్యుని ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు స్వామీజీ. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే కనీసం కేసు కూడా నమోదు చేయకుండానే లంగర్ హౌజ్ సి.ఐ కిడ్నాపర్లను వదిలేశారు. కావాలనే సి.ఐ కిడ్నాపర్లను వదిలేశాడని స్వామీజీ ఆరోపిస్తున్నారు. ప్రాణాలు అర చేతిల్లో పెట్టుకొని వారం రోజులు బిక్కు బిక్కు మంటూ గడిపానని, మానసికంగా, శారీరకంగా తనను వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:
Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త… కాస్త తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ధర ఎంతుందంటే..
Budget 2021: కొత్త బడ్జెట్‌పై స్టార్టప్ కంపెనీల ఆశలు.. కార్పొరేట్ రంగానికి ఉపశమనం కలిగించేనా..?