AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత ఈజీగా ఎలా నమ్మావక్కా.. పెళ్లి పేరుతో యువతికి కుచ్చుటోపి.. ఏకంగా రూ.35లక్షలు కాజేసిన కేటుగాడు!

హైదరాబాద్‌ నగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మ్యారేజ్ బ్రోకరేజ్ ప్లాట్‌పామ్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్న కేటుగాడు.. ఆమెకు మాయమాటు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.35 లక్షలు కాజేశాడు. చివరకు మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంత ఈజీగా ఎలా నమ్మావక్కా.. పెళ్లి పేరుతో యువతికి కుచ్చుటోపి.. ఏకంగా రూ.35లక్షలు కాజేసిన కేటుగాడు!
Malkajgiri Matrimony Fraud
Anand T
|

Updated on: Feb 12, 2026 | 8:19 PM

Share

మ్యాట్రీమెనీలో పరిచయం పెంచుకొని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ కేటుగాడు యువతి నుంచి ఏకంగా రూ.35లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరి పీఎస్‌ పరిధిలోని నివాసం ఉంటున్న ఓ యువతి ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో ఇటీవలే సంబంధాలు వెతికేందుకు మ్యాట్రిమోనియల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రర్ అయింది. అయితే ఆమె ఫ్రొఫైల్‌ను గమనించి కేటుగాడు యువతికి రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో ఆమె రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

సదురు వ్యక్తి తనను వ్యాపారవేత్తగా యువతితో పరిచయం పెంచుకున్నాడు. అది నిజమేనని నమ్మిన యువతి అతనితో రెగ్యులర్‌గా ఫోన్‌ మాట్లాడడం, ఛాట్ చేయడం సాగించింది. ఇలా కొద్ది రోజుల్లోనే వారి మధ్య పరిచయం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నిందితుడు ఓ రోజూ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో యువతి కూడా పెళ్లికి అంగీకరించి.. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఇద్దరి జాతకాలు కలవక పోవడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. కానీ యువతి మాత్రం అతనితో ఇంకా మాట్లాడుతూనే ఉంది.

ఇదే అదునుగా భావించిన కేటుగాడు తన కోసం డైమండ్స్ కొన్నానని, అలాగే తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నానని.. అందుకోసం కొంత డబ్బు కావాలని యువతిని కోరాడు. అది నిజమేనని నమ్మిన యువతి.. పలు దఫాలుగా నిందితుడు చెప్పి అకౌంట్లోకి డబ్బులు పంపించింది. ఇలా అడిగిన ప్రతిసారి ఆమె డబ్బు పంపిస్తూనే వచ్చింది. అతను ఇంకా కావాలి అని అడడంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ అతనికి డబ్బులు ఇచ్చింది.

అయితే డబ్బులు అందిందిన కొన్ని రోజుల తర్వాత నిందితుడు ఆమె మెసేజ్‌లు, ఫోన్‌లకు సమాధానం ఇవ్వడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి స్ధానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!