కృష్ణా జిల్లాకు చెందిన యువతిని ఆమె సొంత అన్న బలవంతంగా వివాహం చేసుకొని గర్భవతిని చేసిన కేసులో విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి మరణించేంత వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, బాధితురాలికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.