AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టపడ్డా.. పాలమ్మినా..పూలమ్మినా.. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన విద్యార్థి.. హరీశ్ రావు సభలో నవ్వులే నవ్వులు..

విదేశాలకు వెళ్లి చదివేందుకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. గురుకుల లా కాలేజ్ కూడా వచ్చిందని తెలియజేశారు. ఇన్నోవేషన్ కోసం టీ హబ్, వీ హబ్ ఉన్నాయని..

కష్టపడ్డా.. పాలమ్మినా..పూలమ్మినా.. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన విద్యార్థి.. హరీశ్ రావు సభలో నవ్వులే నవ్వులు..
Student Imitates
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2023 | 6:56 PM

Share

గత కొంతకాలంగా మంత్రి మల్లారెడ్డి స్పీచ్ కు సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. అందులో మంత్రి మల్లారెడ్డి కష్టపడ్డానంటూ చెప్పిన మాటలు ఇప్పుడు మరోమారు వైరల్ అవుతున్నాయి. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి హరీశ్‌ రావు చేతుల మీదుగా ప్రభుత్వ కళాశాల కొత్త బిల్డింగ్‌ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు విద్యార్థులతో కాసేపు సరదాగా మాట్లాడారు. విద్యార్థులను పిలిచి..వారి లక్ష్యాలు, ఇష్టాయిష్టాల గురించి సరదాగా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి.. తనకు మంత్రి మల్లారెడ్డి ఇష్టమని.. తాను ఆయనకు అభిమానిని అని చెప్పాడు.

మంత్రి మల్లారెడ్డి అంటే తనకెంతో ఇష్టం అంటూ మంత్రి హరీష్ రావు ముందు మల్లారెడ్డిని ఇమిటేట్ చేశాడు ఆ విద్యార్థి. ఆ విద్యార్థి మాటలతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. దాంతో ఆ విద్యార్థిని అడిగి మరీ ఇమిటేట్ చేపించుకున్నారు మంత్రి హరీశ్‌రావు. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్‌ గా మారిన మంత్రి మల్లారెడ్డి మాటలను ఆ విద్యార్థిని యధాతథంగా పఠించాడు.

కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. డైలాగ్‌ను చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఆ తర్వాత.. ఆ విద్యార్థి లక్ష్యమేంటన్నది అడిగి తెలుసుకుని.. ఆల్ ది బెస్ట్ చెప్పారు హరీశ్ రావు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. విదేశాలకు వెళ్లి చదివేందుకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. గురుకుల లా కాలేజ్ కూడా వచ్చిందని తెలియజేశారు. ఇన్నోవేషన్ కోసం టీ హబ్, వీ హబ్ ఉన్నాయని.. అక్కడ కొత్త కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. సోషల్ మీడియాలో అనేక రకాలైన విషయాలు అందుబాటులో ఉంటాయి. మనకు అవసరం ఉన్నవి తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మంత్రి హరీశ్‌ రావు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..