Hyderabad: కార్పొరేట్ కాలేజీలపై తెలంగాణ సర్కార్ నజర్.. సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో కీలక నిర్ణయం.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్‌లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం.. తన సూసైడ్‌కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్ రాయడం ఎంతటి సంచలనం సృష్టించిందో..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్‌లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం.. తన సూసైడ్‌కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్ రాయడం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో రాష్ట్ర విద్యా శాఖ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కాలేజీలను కంట్రోల్ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందలో భాగంగానే సోమవారం ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో అధికారులు భేటీ అయ్యారు. నిజానికి ఈ భేటీకి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండగా చివరి క్షణంలో మంత్రి హాజరుకాలేరు.
ఇదిలా ఉంటే ఈ సమావేశం తర్వాత అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాత్విక్ ఘటన జరిగిన నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీ వచ్చే అకాడమిక్ ఇయర్‌కి రద్దు చేశారు. అదే విధంగా కార్పొరేట్ కాలేజీల ప్రచారాలపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులు, విద్యార్థులను ఆకర్షించేలా ఇచ్చే ప్రకటనలపై నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దండించే, దూషించే లెక్చరర్లు ఎక్కడా పని చేయకుండా నిషేదం విధించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే సాత్విక్ ఘటనపై శ్రీ చైతన్య యాజమాన్యం ఇంటర్ బోర్డుకు క్షమాపణ చెప్పింది. దీనిపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ స్పందిస్తూ.. క్షమాపణ చిన్నపదమని మండిపడ్డారు. ఈ సంరద్భంగా కార్పొరేట్ కాలేజీలపై నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమావేశంలో ప్రైవుటు విద్యా సంస్థలు చైర్మన్‌లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..