Hyderabad: అంబర్‌పేటలో కుక్కల దాడిలో మృతుడి కుటుంబానికి GHMC మేయర్ ఆర్థిక సాయం..

ఇటీవల అంబర్‌పేటలో కుక్కల దాడిలో మృతి చెందిన ప్రదీప్‌ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆర్థిక సాయం అందించారు.

Hyderabad: అంబర్‌పేటలో కుక్కల దాడిలో మృతుడి కుటుంబానికి GHMC మేయర్ ఆర్థిక సాయం..
Mayor Gadwal Vijayalakshmi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 06, 2023 | 7:55 PM

ఇటీవల అంబర్‌పేటలో కుక్కల దాడిలో మృతి చెందిన ప్రదీప్‌ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆర్థిక సాయం అందించారు. అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి రూ. 9,71,900 ఆర్థిక సహాయం అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇందులో బల్దియా తరఫున రూ.6 లక్షలు, మేయర్‌ రూ.2 లక్షల వ్యక్తిగత సాయంతోపాటు, తన నెల జీతం రూ.65,000, డిప్యూటీ మేయర్‌ వేతనం రూ.32,500 ఇవ్వనున్నట్టు విజయలక్ష్మి తెలిపారు. బీజేపీ కార్పొరేటర్లు రూ.లక్ష ఇస్తామని చెప్పారు. పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కార్పొరేటర్లు తమ నెల జీతం ఇస్తామని ప్రకటించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపి సాయమందేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ తెలిపారు.

ఇదిలావుంటే.. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి..మరోసారి టంగ్‌స్లిప్‌ అయ్యారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన విషయంలో ఇప్పటికే ఓ సారి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేయర్. అదే ఘటనపై స్పందిస్తూ.. మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఎవరికో కుక్క కరిస్తే.. ఆ క్కుకలకు తానే కరమవని చెప్పినట్టుగా తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మీ..అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. మహిళలు ముందుకెళ్లాలని సూచించారు.

ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మేయర్‌గా పని చేయటం అంత సులువు కాదన్నారు గద్వాల విజయలక్ష్మి. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో.. తనపై ఎన్నో విమర్శలు చేశారని బాధపడ్డారు. బాలుడిని కరవమని తానే చెప్పినట్టుగా ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు