Mayor Gadwal Vijayalakshmi: కరవమని కుక్కలకు నేను చెప్పానా?.. మహిళా దినోత్సవం కార్యక్రమంలో GHMC మేయర్ షాకింగ్ కామెంట్స్
అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన విషయంలో ఇప్పటికే ఓ సారి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేయర్..అదే ఘటనపై స్పందిస్తూ.. మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఎవరికో..
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి..మరోసారి టంగ్‌స్లిప్ అయ్యారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన విషయంలో ఇప్పటికే ఓ సారి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేయర్..అదే ఘటనపై స్పందిస్తూ.. మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఎవరికో కుక్క కరిస్తే.. ఆ క్కుకలకు తానే కరమవని చెప్పినట్టుగా తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మీ..అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆకాంక్షించారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా.. మహిళలు ముందుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మేయర్‌గా పని చేయటం అంత సులువు కాదన్నారు గద్వాల విజయలక్ష్మి. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో.. తనపై ఎన్నో విమర్శలు చేశారని బాధపడ్డారు. బాలుడిని కరవమని తానే చెప్పినట్టుగా ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.
వీధి కుక్కలను అరికట్టడంలో జీహెచ్ఎంసీ పాలకవర్గం వైఫల్యం చెందినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై ఇవాళ ఆమె పరోక్షంగా స్పందించారు. రాష్ట్రలలోని పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడులు చోటు చేసుకుంటున్నాయి. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం