Hyderabad: రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు.. నగరంలో పర్యటించిన కుక్కల నియంత్రణ కమిటీ..
కుక్కల నియంత్రణకు GHMC చర్యలు చేపట్టింది. హై లెవెల్ కమిటీ సిటీలో పర్యటించింది. అటు అంబర్‌పేట్‌లో కుక్కదాడిలో మృతిచెందిన బాలుడికుటుంబానికి మేయర్ ఆర్థిక సహాయం అందించారు.
హైదరాబాద్ సిటీలో కుక్కల నియంత్రణ కోసం ఏర్పాటైన GHMC హైలెవల్ కమిటీ సిటీలో పర్యటించింది. ఫతుల్లాగూడలోని యానీమల్ కేర్ సెంటర్‌ని సందర్శించారు. GHMC వెటర్నరీ చీఫ్ అధికారి, కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌ల సమక్షంలో అన్నిపార్టీల నుంచి ఇద్దరుసభ్యుల చొప్పున ఉన్న కార్పొరేటర్లు.. యానీమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుక్కలబోన్లు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. అంబర్‌పేట్ వీధికుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి 9లక్షల 71వేల 900 రూపాయల పరిహారం అందజేశారు. బాలుడి తండ్రి గంగాధర్‌ను పిలిచి ఎక్స్‌గ్రేషియా అందజేశారు. బాధిత కుటుంబసభ్యులతో మేయర్, హైలెవల్ కమిటీ సభ్యులు మాట్లాడి ధైర్యం చెప్పారు.
మరోవైపు జీహెచ్‌ఎంసీ ఆఫీసు ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అంబర్‌పేట కుక్కకాటుతో మృతిచెందిన బాలుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు.
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి..మరోసారి టంగ్‌స్లిప్ అయ్యారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన విషయంలో ఇప్పటికే ఓ సారి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్న మేయర్..తాజాగా అదే ఘనపై మరోసారి కామెంట్ చేశారు. ఎవరికో కుక్క కరిస్తే..ఆ క్కుకలకు తానే కరమవని చెప్పినట్టుగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మేయర్ విజయలక్ష్మి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం