సెల్యూట్..! వ్యాపారికి హార్ట్ ఎటాక్.. సీపీఆర్ చేసి కాపాడిన హెడ్ కానిస్టేబుల్

నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అయితే అత్యవసర సమయంలో సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ రామకృష్ణను పలువురు అభినందిస్తున్నారు.

సెల్యూట్..! వ్యాపారికి హార్ట్ ఎటాక్.. సీపీఆర్ చేసి కాపాడిన హెడ్ కానిస్టేబుల్
Cpr
Follow us

|

Updated on: Mar 06, 2023 | 6:04 PM

గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యాపారిని అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ సిపిఆర్ చేసి కాపాడారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. తాండూరు పట్టణానికి చెందిన ఓ వ్యాపారి గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ బాధితునికి సీపీఆర్ చేసి ప్రాణం కాపాడే ప్రయత్నం చేశారు. సకాలంలో చేసిన చర్యలకు బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తాండూరు పట్టణం తులసీనగర్‌కు చెందిన నగేష్ (36) పట్టణంలో ఉషోదయ షోరూం నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉండగా కుప్పకూలి పడిపోయాడు. ఆందోళన చెందిన భార్య గట్టిగా కేకలు వేసింది. అదే కాలనీలో ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ కుమారుడు కేకలు విని తండ్రికి చెప్పాడు.. వెంటనే హెడ్‌ కానిస్టేబుల్ రామకృష్ణ ఇంట్లోకి వెళ్లి చూడగా నగేష్ అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. గుండె కొట్టుకోవడం లేదని గమనించి వెంటనే సీపీఆర్ చేశారు. క్షణాల్లో గుండె కొట్టుకోవడంతో వెంటనే కారులో మళ్లీ సీపీఆర్‌ చేసుకుంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తీసుకువెళ్లారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అయితే అత్యవసర సమయంలో సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ రామకృష్ణను పలువురు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం