AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కోడి కనిపిస్తే ఫసక్.. ఒరెయ్.. మీకు ఇదేం రోగంరా బాబు..!

చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా విలువైన వస్తువులను దొంగతనం జరగడం గురించి విన్నాం. వీళ్లు మాత్రం వేరే రేంజ్.. చికెన్ షాపులను మాత్రమే టార్గెట్ చేస్తారు.. దర్జాగా ఆటోలో వస్తారు.. చికెన్ షాపు బయట కనిపించే కోళ్లను తస్కరిస్తారు. కోళ్లను మెల్లగా ఆటోలో వేసుకుని జారుకుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కోళ్ల మాయమవుతండటంతో అనుమానం వచ్చిన యాజమానులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు వ్యవహారం బయటపడింది.

Telangana: కోడి కనిపిస్తే ఫసక్.. ఒరెయ్.. మీకు ఇదేం రోగంరా బాబు..!
Chicken Shop
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 28, 2024 | 11:28 AM

Share

ఎవరైనా విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలిస్తారు. కానీ వీళ్లు అదో టైపు..! కోళ్ల చోరీలు వీరి ప్రత్యేకత.. చికెన్ సెంటర్స్‌ను టార్గెట్ చేసే ఈ దొంగలు రాత్రికి రాత్రే కోళ్లను దొంగిలించి, ఆటోలో అపహారించుకుపోతుంటారు. మాయమవుతున్న కోళ్లతో కంగారుపడ్డ వ్యాపారులను పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాల ద్వారా ఈ కోళ్ల దొంగల అసలు కథ బయటపడింది.

మహబూబాబాద్ జిల్లాలో ఈ మధ్య వరుసగా కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఒకటి రెండు కోళ్ళు పోవడంతో కొంతమంది లైట్ తీసుకున్నారు. కానీ డోర్నకల్ మండల కేంద్రంలోని భవాని చికెన్ సెంటర్‌లో పెద్ద ఎత్తున కోళ్లు తెల్లవారిసరికే మాయం కావడంతో యాజమాని మహేష్ కు డౌట్ వచ్చింది. దీంతో దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలు చెక్ చేశాడు. ఇంకేముంది ఆ కోళ్ల దొంగను చూసి షాక్ అయ్యాడు. ఆటోలో వచ్చినా కోళ్ల దొంగలు.. చికెన్ సెంటర్ ముందు స్టాండ్ లో నిర్బంధించి ఉన్న కోళ్లను అపహరించుకుపోయాడు.

వీడియో చూడండి… 

తెల్లవారుజామున ఇలా కోళ్లను దొంగిలించడం వీళ్ళ ప్రత్యేకత.. ఆటో లో వచ్చిన ఈ కోళ్ల దొంగలు ఎవరు అనేది అంతుచికడం లేదు. దొంగిలించిన కోళ్లను ఎక్కడైనా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారా లేక వాళ్ళే ఈ కోళ్లను తింటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా షాపులో జరిగిన కోళ్ల చోరీ ని గుర్తించిన షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విచిత్ర దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..