MLA Rajaiah: టికెట్ రాకపోవడంతో భోరున ఏడ్చేసిన రాజయ్య.. కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదంటూ..
Jagaon District News: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీకి దింపారు. కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు.

జనగామ జిల్లా, ఆగస్టు 22: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీకి దింపారు.
స్టేషన్ ఘనపూర్ కు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య బొరుమన్నారు.. అంబేద్కర్ విగ్రహం వద్ద నేలపై పడుకొని చిన్నపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు.. ఆయనలో డ్యాన్స్ లు చిలిపి చేష్టలు మాత్రమే చూసిన జనం ఈ యాంగిల్ చూడలేక ఎమోషన్ అయ్యారు. వర్షంలో తడుస్తూ కాసేపు కన్నీళ్ళపర్యంతమయ్యారు. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు.. నేలపై పడుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ నిరాకరించిన కేసీఆర్ ఆ స్థానంలో మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని బరిలోకి దింపబోతున్నట్లుగా ప్రకటించారు.. కడియం పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి స్టేషన్ ఘనపూర్ కు వచ్చిన రాజయ్యకు ఆయన అభిమానులు బాధాతప్త హృదయంతో స్వాగతం పలికారు. ఆయనకు మద్దతు ప్రకటించారు.
గాంధీ విగ్రహం నుంచి మొదలుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు రాజయ్య అభిమానులు ర్యాలీ నిర్వహించారు. కన్నీళ్లు దిగమింగుకుంటూ కార్యకర్తలతో కలిసి నడిచారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోగానే కార్యకర్తలను చూసి భోరుమన్నారు ఎమ్మెల్యే రాజయ్య.
మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం, ఆప్యాయతను మర్చిపోలేనని కేసీఆర్ నాకు ఇంతకంటే తగిన స్థాయి కల్పిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. తండ్రి లాంటి కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. చిన్నపిల్లవాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. రాజయ్యను చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లిన రాజయ్య కుండపోత వర్షంలోనూ అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చుని కాసేపు మౌనం పాటించారు.. ఆ తర్వాత అంబేద్కర్ పాదాల వద్ద నేలపై పడుకొని బోరున విలపించారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దంటూ కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ తనకు ఏం ఆదేశిస్తే అదే పాటిస్తానని తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వక పోయినా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించిన రాజయ్య తన బాధను మాత్రం తట్టుకోలేకపోయారు..
రాజయ్య డ్యాన్స్ లు, చిలిపి చేష్టలు మాత్రమే చూసిన ఘనపూర్ ప్రజలు ఆయన ఇలా గుండెలు అవిసెలా రోదించడం చూసి తట్టుకోలేకపోయారు.. ఆయన వెంట నడిచిన కార్యకర్తలు, ప్రజలు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. స్టేషన్ ఘనపూర్ లో కొంతసేపు ఎమోషన్ వాతావరణం కనిపించింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం