TOSS: అందరూ పాస్.. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు
ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తూ టాస్ ఉత్తర్వులు జారీచేసింది.

ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తూ టాస్ ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థులందరికీ కనీసం 35మార్కులు వేసి పాస్ చేసినట్లుగా ఉత్తర్వులో పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో TOSS ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని టాస్ నిర్ణయించుకుంది.
ప్రభుత్వ ఈ నిర్ణయంతో 42,748 మంది ఎస్‌ఎస్‌సి విద్యార్థులు ఉండగా.. వీరిలో 29,110 మంది రెగ్యులర్, 13,638 మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా 25,302 మంది రెగ్యులర్ 9,914 సప్లమెంటరీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు వీరంతా ఒకసారి ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. వారికి సంబంధించిన పాస్ మెమోలను త్వరలోనే అందిస్తామని తెలిపింది. పూర్తివివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.telanganaopenschool.org/ చూడొచ్చని తెలిపింది.
