Telangana: కామారెడ్డిలో దారుణం.. కన్నతల్లిని చంపి పూడ్చిపెట్టిన కొడుకు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
80 ఏళ్ల వయసు.. కదల్లేని పరిస్థితిలో తల్లి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడింది. ఆమెకు ఆ ఇంట్లో సేవ చేసేందుకు కొడుకు తప్ప మరొకరు లేరు. దీంతో కొడుకు ఆమెకు సేవలు చేయలేక.. నవమాసాలు మోసి తనను పెంచిన అమ్మను కొడుకు కడతేర్చాడు. ఎందుకు చంపావు అంటే..

80 ఏళ్ల వయసు.. కదల్లేని పరిస్థితిలో తల్లి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడింది. ఆమెకు ఆ ఇంట్లో సేవ చేసేందుకు కొడుకు తప్ప మరొకరు లేరు. దీంతో కొడుకు ఆమెకు సేవలు చేయలేక.. నవమాసాలు మోసి తనను పెంచిన అమ్మను కొడుకు కడతేర్చాడు. ఎందుకు చంపావు అంటే.. సేవ చేస్తూ కుర్చుంటే జీవితం గడవదని, సేవ చేసే ఓపిక లేక, అవకాశం లేక.. ఆమెను చంపేసినట్లు చెబుతున్నాడు ఆ కొడుకు. కని, పెంచి సాకిన ఆ తల్లికి ఈ కొడుకు చావును బహుమతిగా ఇచ్చాడు.. కన్న తల్లిని చంపి.. పూడ్చిపెట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ 80 సంవత్సరాలు వయస్సు కలిగిన వృద్ధురాలు.. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉంది. దీంతో అన్ని రకాల సేవలు, సపర్యాలు కన్న కొడుకు చిన్న బాలయ్య చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలవ్వకు సేవలు చేయలేక కన్నతల్లిని ఈనెల 13వ తారీకున గొంతు నలిమి చంపాడు. అనంతరం గుట్టు చప్పుడుకాకుండా తల్లి శవాన్ని మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుక భాగంలోని ఓ ప్రదేశంలో పాతిపెట్టాడు.
ఆ తర్వాత చిన్న బాలయ్య.. ఎవరికీ అనుమానం రాకుండా తన తల్లి అదృశ్యమైనట్లు మరుసటి రోజు 14వ తారీఖున స్థానిక సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాలయ్య పై అనుమానంతో గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ బీరయ్య పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో బాలయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుక భాగంలో తల్లిని గొంతు నలిమి పూడ్చిపెట్టినట్లుగా పోలీసుల సమక్షంలో అంగీకరించాడు. దీంతో మృతురాలు శవానికి పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..




