AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: ఓర్నీ ఇది అసలు మెలిక.. అందుకే సైబర్ కేటుగాళ్లకు కళ్లెం పడటం లేదు

సైబర్ క్రైమ్స్ విషయంలో మన అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవ్వాగానే పోలీసులను అప్రోచ్ అవుతాం. వారు ఆ డబ్బు ఎటువంటి ఖాతాలకు బదిలీ అవ్వకండా వెంటనే బ్యాంకుల సహకారం తీసుకుంటారు. అయితే ఇక్కడే అసలు మెలిక ఉంది...

Cyber Crime: ఓర్నీ ఇది అసలు మెలిక.. అందుకే సైబర్ కేటుగాళ్లకు కళ్లెం పడటం లేదు
Cyber Crime
Vijay Saatha
| Edited By: |

Updated on: Dec 06, 2024 | 12:42 PM

Share

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని ఉపయోగించుకొని డిజిటల్ నేరాలు లక్షలు దాటి కోట్లకు చేరాయి. ప్రతి ఏడాది లక్షకుపైగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్టు వేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడుతుంటే సైబర్ నేరగాళ్లు మాత్రం అత్యంత సులభంగా ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో కూర్చుని సైబర్ నేరానికి పాల్పడుతున్నారు.

ఇటీవల కాలంలో సైబర్ నేరస్తుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న పోలీసులకు కళ్ళు చెదిరే నిజాలు బయటపడ్డాయి. ఒక సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయిస్తాడు. తాను మోసపోయిన డబ్బును ఫలానా ఖాతాకు పంపించానని బాధితుడు పోలీసులకి అన్ని వివరాలు ఇస్తాడు. ఒక్క బ్యాంక్ అకౌంట్ నంబర్‌తోనే పోలీసులు ఆ కేసును చేదిస్తారు.. కానీ పోలీసులు నిందితులను పట్టుకున్న తర్వాత అతడి బ్యాంక్ ఖాతాలో కొన్నిసార్లు డబ్బు కనీసం మినిమం బాలన్స్ కూడా ఉండటం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు బ్యాంక్ అధికారుల సహకారం తీసుకున్నారు. అయితే పోలీసులకి బ్యాంక్ అధికారులు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బాధితుడు నుండి డబ్బు కొట్టేసిన తర్వాత నిందితుడి ఖాతాలోకి డబ్బు చేరుతుంది. నిందితుడి ఖాతాలోకి డబ్బు వచ్చిన క్షణాల వ్యవధిలోనే మరో 20 అకౌంట్లకు ఈ డబ్బును బదిలీ చేస్తున్నారు. ఈ విషయం మొత్తం బ్యాంక్ అధికారులకు ముందే తెలుసు. బ్యాంక్ అధికారులకు ఇలాంటి నేరాల గురించి తెలిసిన సైబర్ నేరస్తుల వివరాలను పోలీసులకు చెప్పటం లేదు. సైబర్ నేరస్తులతో పలువురు బ్యాంక్ అధికారులు కుమ్మక్కయి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ అధికారులు సైబర్ నేరగాళ్ల సహకారంతోనే అనేక ఏజెంట్లకు బ్యాంకు ఖాతాలను ఎలాంటి ఆధారాలు లేకుండా తెరిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

వీరిలో ఎక్కువ శాతం గుజరాత్ నుండే బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న బ్యాంక్ ఖాతాలలో ఎక్కువ శాతం గుజరాత్ రాష్ట్రంలోనే తెరిచినవిగా పోలీసులు దర్యాప్తులో బయటపడింది. దీంతో అసలు బ్యాంకు సిబ్బంది సహకారం లేకుంటే సైబర్ నేరస్తులు ఈ స్థాయిలో డబ్బులు కొలగొట్టేవారు కాదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరస్తులు డిజిటల్ రూపంలో డబ్బులు కాజేస్తున్నప్పటికీ అవి జమ అయ్యే బ్యాంక్ ఖాతాలే ప్రతి కేసులో కీలకంగా మారుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..