AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కాలం తీరిన మందులిచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్లు.. గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు..

హైదరాబాద్ పాతబస్తీలో ప్రజల ప్రాణాలతో వైద్యులు చెలగాటం ఆడుతున్నారు. మొఘల్‌పురాలోని ఆల్ఫా ఆస్పత్రి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కాలం చెల్లిన మందులతో ఆ రోగికి ట్రీట్‌మెంట్‌ చేయడమే ఇక్కడ పెద్ద వివాదానికి దారి తీసింది.

Hyderabad: కాలం తీరిన మందులిచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్లు.. గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు..
Expired Medicines
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 06, 2024 | 12:40 PM

Share

హైదరాబాద్ పాతబస్తీలో అపెండిక్స్‌ ఆపరేషన్‌ కోసం ఆస్పత్రిలో సర్ఫరాజ్‌ అనే యువకుడు చేరాడు. ఆ యువకుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కాలం చెల్లిన సెలైన్‌తో పాటు ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. దీంతో యువకుడి ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆ యువకుడి ఆరోగ్యం చేయిదాటిపోవడంతో కుటుంబ సభ్యులకు వైద్యులపై పలు అనుమానాలు వచ్చాయి. మందులపై దృష్టిపెట్టగా 9 నెలల క్రితమే కాలం చెల్లిన మందులు ఇచ్చినట్టు తేలింది. దీంతో ఆధారాలతో సహా మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఆల్ఫా ఆస్పత్రిపై సంబంధిత అధికారులతో పాటు పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో యువకుడి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడింది. ఎవరినీ గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ప్రైవేట్‌ ఆస్పత్రుల ధన దాహానికి ఎందరో పేదలు బలైపోతున్నారు. అధిక బిల్లులు వసూలు చేయడం, బిల్లు కడితే తప్ప మృతదేహాన్ని బంధువులకు అప్పగించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ ఆస్పత్రిలో మాత్రం కాసుల కక్కుర్తితో కాలం చెల్లిన మందులను రోగులకు ఇచ్చి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎవరు సరఫరా చేస్తున్నారో నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us