Dream Science: కలలో ఇవి కనిపిస్తే మంచి రోజులు రానున్నాయని అర్ధం.. ఆ కలలు ఏమిటో తెలుసా..
కొన్ని కలలను శుభప్రదంగా భావిస్తారు. అయితే కొన్ని కలలు అశుభకరమైనవిగా భావిస్తారు. కలలు మన భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చెబుతాయని నమ్మకం. ఈ రోజు మంచి సమయం అవుతుందని సూచించే విధంగా వచ్చే కలల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
హిందూ మతంలో అనేక రకాల గ్రంథాలున్నాయి. వీటిలో ఒకటి డ్రీమ్ సైన్స్. అంటే స్వప్న శాస్త్ర. ఈ స్వప్న శాస్త్రంలో కలలకు అర్ధాల గురించి పేర్కొన్నారు. ఎవరైనా నిద్రించే సమయంలో ఏదోక కల వస్తుందని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. సాధారణంగా ఎక్కువ మంది రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన కలలను కంటారు. అయితే కొన్నిసార్లు విభిన్నమైన కలలు కంటారు. కొన్ని కలలు భవిష్యత్తులో జరిగే మంచి, చెడులకు ముందస్తు సూచన. అయితే కలలు వచ్చే సమయం, ఇతర విషయాల బట్టి స్వప్నాలకు అర్దాలుంటాయి. స్వప్న శాస్త్రంలో రకరకాల కలలు, వాటి అర్థాల గురించి వివరించారు. ఈ రోజు మనం అనేక కలలు, వాటి అర్థాల గురించి తెలుసుకుందాం..
కలలో వర్షం కనిపిస్తే కలలో వర్షం కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అది చాలా శుభకరమైన కల. కలలో వర్షాన్ని చూడటం అంటే త్వరలో శుభవార్త వింటారని అర్ధం. అలాగే వర్షం చూడడం అంటే జీవితంలో మంచి జరగబోతుందని అర్ధమట.
కలలో చంద్రుడిని చూడటం స్వప్న శాస్త్రంలో కలలో చంద్రుడు కనిపించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలల శాస్త్రం ప్రకారం కలలో చంద్రుడు కనిపిస్తే.. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే.. ఆ సమస్య త్వరలో పరిష్కరించబడుతుందని అర్థం. అంతే కాదు కలలో చంద్రుడు కనిపిస్తే త్వరలో ఇంట్లో ఆనందం నెలకొంటుంది.
కలలో కత్తిరించిన గోర్లు చూడటం కలలో గోర్లు కత్తిరించుకున్నట్లు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. కలలో గోళ్లు కత్తిరించుకోవడం అంటే గతంలో చేసిన అప్పుల నుంచి విముక్తి పొందబోతున్నారని అర్థం. కలలో గోర్లు కత్తిరించుకున్నట్లు కనిపిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం.
పక్షిలా ఎగురుతున్నట్లు కల వస్తే మీ కలలో మీరు పక్షిలా ఎగురుతున్నట్లు కనిపిస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం.. మీకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి సంకేతం.అంతేకాదు కలలో పక్షిలా ఎగురుతున్నట్లు చూడటం అంటే మీ జీవితంలో ఉన్న సమస్యలు నుంచి బయటపడనున్నట్లు అర్థం.
కలలో నది కనిపిస్తే నిద్రిస్తున్నప్పుడు కలలో నది కనిపిస్తే.. త్వరలో శుభవార్తను వినబోతున్నారని సంకేతం. ఇలాంటి కల కంటే మీరు చాలా శుభవార్తలను వినబోతున్నారని స్వప్న శాస్త్రం పేర్కొంది.
కలలో పండ్ల తోట కనిపిస్తే కలలో పండ్ల తోట కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదం. కలలో పండ్ల తోటను చూడటం అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. అంతేకాదు త్వరలో ప్రయోజనం పొందనున్నారని పేర్కొంది స్వప్న శాస్త్రం.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.