AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ ఎంపీ సీటు కింద రూ.500 నోట్ల కట్ట.. విచారణకు ఆదేశించిన రాజ్యసభ ఛైర్మన్

రాజ్యసభలో బయటపడ్డ 500 రూపాయల నోట్ల కట్ట. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధంఖర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎంపీ సీటు కింద రూ.500 నోట్ల కట్ట.. విచారణకు ఆదేశించిన రాజ్యసభ ఛైర్మన్
Rajya Sabha
Balaraju Goud
|

Updated on: Dec 06, 2024 | 12:49 PM

Share

కాంగ్రెస్ సభ్యుల బెంచ్‌పై కరెన్సీ నోట్ల గుట్టు రట్టు కావడంపై రాజ్యసభలో దుమారం మొదలైంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఈ సమాచారం ఇవ్వడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి సంబంధించిన సీటు నంబర్ 222 కింద రూ.500 నోట్ల కట్ట కనిపించింది. అదే సమయంలో తన వద్ద రూ.500 నోటు మాత్రమే ఉందని సింఘ్వీ చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు చైర్మన్ ధంఖర్ ఆదేశించారు.

రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ సీటు కింద నోట్ల కట్ట దొరికిందన్న దానిపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు కింద నుంచి నోట్ల గుట్టు దొరికిందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖర్ పేర్కొన్నారు. నిన్న సెక్యూరిటీ తనిఖీల్లో సింఘ్వీ సీటు కింద నోట్ల కట్ట దొరికిందని చెప్పారు. ఒకవైపు అదానీ అవినీతిపై చర్చ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంటే, అదే కాంగ్రెస్‌పైకి భారతీయ జనతా పార్టీ విరుచుకుపడేందుకు నోట్ల కట్ట ఒక అస్త్రంగా మారింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వి కౌంటర్‌ ఇచ్చారు.

తనపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి ఖండించారు. కేవలం ఒకే 500 నోటును తీసుకుని సభలోకి వెళ్లానని, సరిగ్గా మధ్యాహ్నం 12.57కి సభలో వెళ్లా.. మధ్యాహ్నం 1.30 వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి పార్లమెంటు క్యాంటీన్‌లో ఉండి వెళ్లిపోయానని సింఘ్వి స్పష్టం చేశారు. దీనిపై కూడా చైర్మన్ విచారణ జరిపించాలని సింఘ్వీ అన్నారు.

వాస్తవానికి, డిసెంబరు 5న సభ వాయిదా పడిన తర్వాత సీటు నుంచి రూ.500 నోట్ల కట్ట కనిపించిందని ధంఖర్ సభకు తెలియజేశారు. సీటు నంబర్ 222 నుండి బయటపడిందని, ఇది తెలంగాణ నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి స్థానం. దీనిపై విచారణ చేపట్టినట్లు ధంఖర్ సభలో ప్రకటించారు. దీనిపై విపక్ష కాంగ్రెస్ సభ్యులు రభస సృష్టించారు.

ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. కాబట్టి విచారణ పూర్తయి వాస్తవికత తేలే వరకు ఎవరి పేరునూ తీసుకోవద్దని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. ఒక సీటు నుంచి వచ్చి ఆ సీటును సభ్యుడికి కేటాయించినప్పుడు ఆయన పేరు తీసుకోవడంలో తప్పేముందన్నారు.

నగదు రికవరీ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ నగదు రికవరీ అంశం పార్లమెంటు గౌరవానికి సంబంధించినదని అన్నారు. ఈ ఘటన పార్లమెంటు గౌరవంపై దాడి. ఈ విషయంలో న్యాయమైన, సరైన విచారణ జరుగుతుందని విశ్వసిస్తున్నానన్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ నోట్ల రికవరీ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..