Snake at school: బడికొచ్చిన కోడెత్రాచు.. విద్యార్థులు, సిబ్బంది భయంతో పరుగులు.. చివరకు
రాష్ట్రంలో కోవిడ్ నిబంధనల మేరకు ఇప్పుడిప్పుడే స్కూల్స్ తెరుచుకుంటున్నాయి. తల్లిదండ్రుల అనుమతి మేరకు విద్యార్థులు బడ్డిబాటపట్టారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోనూ పాఠశాలలు తెరుచుకున్నాయి.
Snake at school: రాష్ట్రంలో కోవిడ్ నిబంధనల మేరకు ఇప్పుడిప్పుడే స్కూల్స్ తెరుచుకుంటున్నాయి. తల్లిదండ్రుల అనుమతి మేరకు విద్యార్థులు బడ్డిబాటపట్టారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోనూ పాఠశాలలు తెరుచుకున్నాయి. చింతకాని మండలం చినమండవ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోడెత్రాచు పాము కలకలం రేపింది. క్లాస్ రూమ్ దూరిన భారీ విషసర్పాన్ని చూసిన విద్యార్థులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. బుసలు కొడుతున్న కోడెత్రాచును చూసిన ఉపాధ్యాయులు వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. భారీగా గుమిగూడిన స్థానిక యువకులు కొందరు పామును బంధించారు. దీంతో పెనుప్రమాదం తప్పిందని అంతా ఊపిరీ పీల్చుకున్నారు.
అయితే, ఇక్కడి పాఠశాలలో నర్సరీని ఏర్పాటు చేశారని, ఆ నర్సరీ వల్లే ఇక్కడ పాములు, తేళ్లు లాంటి విషపురుగులు తిరుగుతున్నాయని విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్కూల్ ఆవరణలో పరిసరాలు శుభ్రంతో పాటు నర్సరీని తొలగించాలని కోరుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా ఫ్రిజ్‌లోకి దూరింది…
ఇక ఇటీవల తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో తాచుపాము హల్‌చల్ చేసింది. శుక్రవారం ఓ ఇంట్లోకి దూరిన తాచుపాము ఇంటివారిని పరుగులు పెట్టించింది. చూసేందుకు సన్నగా కనిపించినా..అందరికీ ముచ్చెమటలు పట్టించింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం కమనగరువులో అర్ధరాత్రి తాచుపాము ఓ ఇంట్లోకి దూరింది. ఇంట్లోవాళ్ళని పరుగులు పెట్టించింది. ఏసుబాబు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న ఫ్రిజ్ కిందకు దూరింది. రిఫ్రిజిరేటర్ అడుగున చేరిన తాచుపాము…ఇంట్లోవాళ్ళని భయబ్రాంతులకు గురిచేసింది.
చివరకు…స్నేక్‌క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇవ్వడంతో ..అతడు చాకచక్యంగా వ్యవహరించి..పామును పట్టి డబ్బాలో బంధించాడు. దీంతో ఇంట్లోవాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పామును అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.
Also Read:
మాఘపూర్ణిమ సందర్భంగా గోవుకు శ్రీమంతం..108 మంది ముత్తైదువులతో ఘనంగా.. ఎంత గొప్ప సంస్కారం
TTD News: శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్.. వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అదనపు భారం