AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aatmanirbharbharat : కుటుంబపాలనకు ఆస్కారం లేని బీజేపీలో… పార్టీనే కుటుంబం : కేంద్రమంత్రి ప్రకాష్‌ జవ్‌దేకర్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో పట్టభద్రుల పాత్రపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి.. కేంద్ర సమాచార, పర్యావరణమంత్రి ప్రకాష్‌ జవ్‌దేవకర్‌..

Aatmanirbharbharat : కుటుంబపాలనకు ఆస్కారం లేని బీజేపీలో... పార్టీనే కుటుంబం : కేంద్రమంత్రి ప్రకాష్‌ జవ్‌దేకర్‌
Venkata Narayana
|

Updated on: Feb 27, 2021 | 11:02 PM

Share

ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో పట్టభద్రుల పాత్రపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి.. కేంద్ర సమాచార, పర్యావరణమంత్రి ప్రకాష్‌ జవ్‌దేవకర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మాజీ సీఎస్‌ ఐఆర్‌ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో..మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాలో గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్స్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా పెద్దలసభలో తన గొంతు బలంగా వినిపించిన రామచందర్‌రావు విజయం తథ్యమన్నారు ప్రకాష్‌ జవ్‌దేకర్‌. అధికారపార్టీనేతల విమర్శలు చూస్తుంటేనే..రామచందర్‌రావు విషయంలో వారెంత భయపడుతున్నారో తెలిసిపోతుందన్నారు. కుటుంబపాలనకు ఆస్కారం లేని బీజేపీలో…పార్టీనే కుటుంబమన్నారు ప్రకాష్‌ జవ్‌దేకర్‌.

వ్యాక్సిన్‌ వచ్చిందని ఆదమరిస్తే ప్రమాదమని ప్రకాష్‌ జవదేకర్‌ ఈ సందర్భంగా చెప్పారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలతో పాటు యూరప్‌ దేశాలలో కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రతను గుర్తించి…కొంతకాలం మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా విజయం బీజేపీదేనని.. యూపీఏలా పదేళ్ల పాలనతో సరిపెట్టుకోడానికి రాలేదన్నారు. దేశం సగర్వంగా తలెత్తుకుని ఆత్మనిర్భరంగా బతికేలా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.

Read also : పవన్ Vs గ్రంధి : అతనొక ఆకురౌడీ, కాదు అతనే స్టేడ్ రౌడీ.. మానసిక రోగి, పిచ్చి కుక్కల వ్యాన్.. భీమవరం కేంద్రంగా బుల్లెట్ల లాంటి డైలాగ్‌లు