మాఘపూర్ణిమ సందర్భంగా గోవుకు శ్రీమంతం..108 మంది ముత్తైదువులతో ఘనంగా.. ఎంత గొప్ప సంస్కారం

గోమాతను పూజించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే గుంటూరుకు చెందిన ఓ దంపతులు ఏకంగా ఆవుకు సీమంతం చేశారు. మాఘపూర్ణిమ మంచిరోజుగా భావించి

  • Ram Naramaneni
  • Publish Date - 9:56 pm, Sat, 27 February 21
మాఘపూర్ణిమ సందర్భంగా గోవుకు శ్రీమంతం..108 మంది ముత్తైదువులతో ఘనంగా.. ఎంత గొప్ప సంస్కారం

గోమాతను పూజించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే గుంటూరుకు చెందిన ఓ దంపతులు ఏకంగా ఆవుకు సీమంతం చేశారు. మాఘపూర్ణిమ మంచిరోజుగా భావించి..బంధుమిత్రుల సమక్షంలో ఆవుకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని విసప్పాలెంకు చెందిన బెల్లంకొండ ఈశ్వర్‌ దంపతులు..తమ ఇంట్లోని గోమాతకు సీమంతం వేడుక నిర్వహించారు. మాఘపూర్ణిమ మంచిరోజుగా భావించి 108 మంది ముత్తైదువులతో గోమాతకు సీమంతం జరిపించారు. గర్భిణీలకు జరిపినట్లే గోవుకు సీమంతం వేడుకలు చేశారు. గోమాతకు మంగళ స్నానం చేయించి.. అనంతరం పూలు, పండ్లు, బొట్లు పెడుతూ.. దానికి నచ్చిన ఆహారాన్ని తినిపించారు. పండితుల సమక్షంలో మంగళహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులను కూడా ఆహ్వానించారు.

ఇటీవల  తెలంగాణలో కూడా…

తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు తమకు ఆడబిడ్డలు లోటును ఓ గోమాత రూపంలో తీర్చుకుంటున్నారు. ఆడపిల్లలు లేని మాకు మా ఆవే మా ఆడబిడ్డ అని మురిసిపోతున్నారు. తమ ఆవుని సొంత బిడ్డలా పెంచుకుంటున్నారు. ఇటీవల ఆ ఆవు గర్భం దాల్చింది. ఇక వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో వారు ఈ ఏడాది జనవరిలో ఆవుకు వైభవంగా సీమంతం చేశారు.

 

హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువు ఆవు:

ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు. వీటి నుండి పితికే పాలు శ్రేష్టమైనవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో ఆకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు.. పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యిలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసిందే. 

Also Read:

TTD News: శ్రీవారి భక్తులకు షాకింగ్‌ న్యూస్‌.. వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అదనపు భారం

తప్ప తాగి డ్రైవింగ్.. ఏకంగా మూడు వాహనాలు ఢీకొట్టిన యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్