AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorhome Lovers : కారే విల్లా.. విల్లానే కారు.. ఆహా.. ఎంత గొప్ప సోయగం.. అంతే సదుపాయం

తాజాగా ఓ కంపెనీ సరికొత్త విల్లాను సృష్టించింది. కదిలే కారులో ఒక విల్లాను నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ వింత విల్లా గురించి తెలుసుకుందాం...!

Motorhome Lovers : కారే విల్లా.. విల్లానే కారు.. ఆహా.. ఎంత గొప్ప సోయగం.. అంతే సదుపాయం
Surya Kala
|

Updated on: Feb 27, 2021 | 10:05 PM

Share

Chinese Company Creates Luxury RV : రోజు రోజుకీ ప్రపంచంలో పెరుగుతున్న జనాభా. అవసరాలకు అనుగుణంగా పెరగని భూమి. దీంతో మనిషి తాను నివసించడానికి యోగ్యమైన వాటి కల్పనపై దృష్టి పెట్టాడు.. భవనంపై భవనాన్ని నిర్మిస్తూ.. అంబరాన్ని చుంబించేలా ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తున్నారు. అయినప్పటికీ మనిషి నివసించడానికి ఇల్లుల కొరత ఏర్పడుతూనే ఉంది. అయితే తాజాగా ఓ కంపెనీ స రికొత్త విల్లాను సృష్టించింది. కదిలే కారులో ఒక విల్లాను నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ వింత విల్లా గురించి తెలుసుకుందాం…!

సాధారణంగా ఎక్కువుగా మామూలు విల్లాల్ని చూసి ఉంటాం.. అయితే కదిలే ఈ విల్లాని చూసి ఉండరు.. మరి అలా కదిలే విల్లాను చూశారంటే షాక్ అవ్వాల్సిందే…! ఎందుకంటే ఈ విల్లా చాలా వింతగా ఉంది చూడడానికి. ఇది కేవలం డబల్ డెక్కర్ బస్సులా కనిపిస్తుంది. అయితే నిజానికి అది డబల్ డెక్కర్ బస్సు కాదు. అన్ని సదుపాయాలున్న ఓ సరికొత్త విల్లా. ఈ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సర్వసాధారంగా మనం స్థలం కొనుక్కుని రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించుకోవాలంటే.. చాలా డబ్బులు కావాలి.. ముందు భూమి కొనాలి.. తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సిమెంట్, ఇటుక. ఇసుక వంటివి కొనుగోలు చేసుకోవాలి. దీనికి డబ్బులు, శ్రమ కూడా కావాలి.. అయితే ఇక్కడ నుంచి రెండు అంతస్థుల భవన నిర్మాణం కోసం అంత శ్రమ, డబ్బులు అక్కర్లేదు. కేవలం ఇలాంటి కారు ఒకటి కొనుక్కుంటే చాలు. ప్రయాణానికి వాహనంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ కారును ఆపేస్తే వెంటనే విల్లాగా ఉపయోగించుకోవచ్చు.

దీనిలో ఉన్న విచిత్రమేమిటంటే ఈ కారుని మనం పార్క్ చేసి… తర్వాత ఒక బటన్ ని ప్రెస్ చేసి ఉంచితే చాలు. అది రెండంతస్తుల విల్లాలా క్షణాల్లో మారిపోతుంది. పైగా ఇందులో మరో విచిత్రం ఏమిటో తెలుసా…? రెండో అంతస్తు లోకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. పెద్ద రూమ్ విశాలమైన బెడ్ ఉంది. అంతే కాదండి కిచెన్, బాల్కనీ వంటి వసతులు కూడా ఈ కారులోని విల్లాలో ఉన్నాయి.

ఈ సరికొత్త ఆవిష్కరణను చైనీస్ ఆటో సంస్థ మాక్సస్‌ తయారు చేసింది. వి90 లైఫ్‌ హోమ్‌ విల్లా ఎడిషన్‌ పేరు తో రెండవ అంతస్తుల కారును రూపొందించింది. ఈ కారు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో అందుబాటు లో ఉంది.

Also Read:

ఇండియన్ ఐడల్ లో పాల్గొని తమ ప్రతిభ చూపించిన తెలుగు గాయనీగాయకులు ఎవరంటే..

కీలక ప్రకటన చేసిన మిత్రపక్షం.. ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్..