AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌‘బుక్‌’.. సోషల్ మీడియా సంస్థకు అమెరికా షాక్.. 650 మిలియన్ డాలర్ల జరిమానా..

Facebook - US: అగ్రరాజ్యం అమెరికా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ కు షాక్ ఇచ్చింది. ఫేస్‌బుక్.. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను ఉపయోగించడంపై భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ..

ఫేస్‌‘బుక్‌’.. సోషల్ మీడియా సంస్థకు అమెరికా షాక్.. 650 మిలియన్ డాలర్ల జరిమానా..
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2021 | 7:15 AM

Share

Facebook – US: అగ్రరాజ్యం అమెరికా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ కు షాక్ ఇచ్చింది. ఫేస్‌బుక్.. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను ఉపయోగించడంపై భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్ భంగం కలిగించిందంటూ.. 2015లో అమెరికాలోని ఇల్లినాయిస్లో దాఖలైన క్లాస్-యాక్షన్ పిటిషన్‌పై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో విచారణ చేపట్టారు. అయితే ఫేస్‌బుక్ యూజర్ల అనుమతిలేకుండా ఫోటో ఫేస్‌ ట్యాగ్ చేస్తోందని, దీంతోపాటు బయోమెట్రిక్ డేటాను సైతం వినియోగించిందని.. ఇది అమెరికా ప్రైవసీ పాలసీని తుంగలో తొక్కడమేనని యూజర్ల తరుపున న్యాయవాది జే ఎడెల్సన్ చికాగో పేర్కొన్నారు. దీనికి సంబంధించి దాదాపు 16 లక్షల మంది ఫేస్బుక్ వినియోగదారులు వాదనలను సైతం సమర్పించారు.

విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో ఫేస్‌బుక్ ప్రైవసీ పాలసీ నిబంధనలను పాటించలేదని తీర్పునిచ్చారు. ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగించడమేనని వెల్లడించారు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనిప్రకారం నష్టపోయిన యూజర్లందరికీ.. ఒక్కొక్కరికి 345 డాలర్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో సెటిల్‌మెంట్ జరగడం ఇదే తొలిసారని జడ్జి డొనాటో వెల్లడించారు. పిటీషన్ వేసిన చికాగో న్యాయవాది జే ఎడెల్సన్ మాట్లాడుతూ తీర్పును అప్పీల్ చేయకపోతే ఫేస్‌బుక్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ ప్రతినిధి మాట్లాడుతూ.. తమ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే కర్తవ్యమన్నారు. ఈ విషయంపై పునరాలోచన చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. ఇటీవలనే ఆస్ట్రేలియా – ఫేస్‌బుక్ మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఆ దేశ వార్తల ప్రచురణ, పంచుకోవటంపై ఫేస్‌బుక్‌ నిషేధం విధించింది. ఆ తర్వాత ఇరువర్గాల ఒప్పందంతో.. ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీలకు చెందిన వార్తలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

Also Read:

Motorhome Lovers : కారే విల్లా.. విల్లానే కారు.. ఆహా.. ఎంత గొప్ప సోయగం.. అంతే సదుపాయం

Shocking News: ఇండియాకు అమెరికా అప్పు.. కీలక సమాచారాన్ని వెల్లడించిన అమెరికన్ మెంబర్.. మనకివ్వాల్సింది ఎంతంటే?