AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ నాయకత్వ పురస్కారం..

Global Energy And Environment Leadership Award: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత నాయకత్వ పురస్కారం వరించింది. వచ్చేవారం జరగనున్న వార్షిక అంతర్జాతీయ ఇంధన సమావేశంలో..

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ నాయకత్వ పురస్కారం..
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2021 | 8:06 AM

Share

Global Energy And Environment Leadership Award: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత నాయకత్వ పురస్కారం వరించింది. వచ్చేవారం జరగనున్న వార్షిక అంతర్జాతీయ ఇంధన సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డును స్వీకరించనున్నారు. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు సెరావీక్ కాన్ఫరెన్స్-2021 జరగనుంది. ఈ సదస్సులో (Seravić Conference-2021) ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలకోపన్యాసం చేస్తారని సమావేశాన్ని నిర్వహిస్తున్న ఐహెచ్‌ఎస్ మార్కిట్ తెలిపింది. అనంతరం ప్రధాని మోదీకు ఈ అవార్డును అందించనున్నట్లు వెల్లడించింది.

ప్రపంచ భవిష్యత్ ఇంధన అవసరాలను అధిగమించేందుకు సుస్థిర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్ (Map Marketing) వైస్ చైర్మన్, కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డేనియల్ యెర్జిన్ తెలిపారు. ఆయనకు ఈ అవార్డు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను అధిగమించేందుకు.. పర్యావరణ లక్ష్యాలను చేరుకునకేందుకు మోదీ నాయకత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, పేదరికం తగ్గింపు, భవిష్యత్‌లో ఇంధన అవసరాలకు తగినట్లు మార్గనిర్ధేశం చేయడం, పర్యావరణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు.

అయితే ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షునికి పర్యావరణ రంగంలో ప్రత్యేక రాయబారిగా ఉన్న జాన్ కెర్రీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షుడు, బ్రేక్‌థ్రూ ఎనర్జీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, సౌదీ అరంకో సీఈఓ అమీన్ నాజర్ ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంతర్జాతీయ సెరావీక్‌ సదస్సు-2021లో సదస్సులో చమురు సంస్థలు, పర్యావరణ నిపుణులు, పలు దేశాల ప్రతినిధులు, ఐటీ, ఆర్థిక పారిశ్రామిక వర్గాల నేతలు పాల్గొననున్నారు.

Also Read:

Covid Vaccine:ఫ్రీ కాదు, ప్రైవేటు హాస్పిటల్స్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసు 250 రూపాయలు ? ఫిక్స్డ్ ప్రైస్

ఫేస్‌‘బుక్‌’.. సోషల్ మీడియా సంస్థకు అమెరికా షాక్.. 650 మిలియన్ డాలర్ల జరిమానా..