Newyork Governor Andrew Cuomo: న్యూయార్క్ గవర్నర్ పై లైంగిక వేధింపుల ఆరోపణ, కొట్టి పారేసిన ఎండ్రు క్యూమో
న్యూయార్క్ గవర్నర్ ఎండ్రు క్యూమో తనను లైంగికంగా వేధించారని పాతికేళ్ల ఓ మహిళ ఆరోపించింది. మాజీ హెల్త్ అడ్వైజర్ అయిన చార్లెట్ బెనెట్ అనే ఈమె..
Newyork Governor Andrew Cuomo: న్యూయార్క్ గవర్నర్ ఎండ్రు క్యూమో తనను లైంగికంగా వేధించారని పాతికేళ్ల ఓ మహిళ ఆరోపించింది. మాజీ హెల్త్ అడ్వైజర్ అయిన చార్లెట్ బెనెట్ అనే ఈమె.. గత ఏడాది ఈయన తనను లైంగికంగా వేధించారని ఆరోపించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 63 ఏళ్ళ ఎండ్రు.. ఇరవై లేదా ఆ దరిదాపు వయస్సు గల యువతులతో తను డేటింగ్ కి సిధ్ధమేనని, ప్రకటించాడట.. రొమాంటిక్ రిలేషన్ షిప్ కి వయస్సు అడ్డు రాదని కూడా చెప్పాడట. లోగడ ఈయనకు హెల్త్ అడ్వైజర్ గా పని చేసిన బెనెట్.. తనను ఆయన ముట్టుకోలేదని, కానీ ఆయన అసభ్య ప్రవర్తనకు భయాందోళన చెందానని వెల్లడించింది. చివరకు ఈ గవర్నర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తోను, న్యాయవాదితోను సంప్రదించగా తనను మరో కొత్త పోస్టుకు బదిలీ చేశారని, తనిప్పుడు సంతోషంగా ఉన్నానని ఆమె స్పష్టం చేసింది.
ఈ కారణంగా నా ఆరోపణలపై దర్యాప్తు చేయాలని నేను కోరడం లేదని బెనెట్ వెల్లడించింది. కానీ ఈ ఆరోపణల నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ పై పెను దుమారమే రేగింది. 10 ఏళ్లుగా ఈ పోస్ట్ లో కొనసాగిన ఈయన 2022 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఇలా ఉండగా బెనెట్ తనపై చేసిన ఆరోపణలను ఎండ్రు కొట్టిపారేశారు. తాను ఆమె పట్ల అసభ్యంగా గానీ, అనుచితంగా గానీ ప్రవర్తించలేదని, ఆమె పట్ల తనకు ఆ ఉద్దేశమే లేదని ఆయన చెప్పారు. పైగా తాను (బెనెట్) లైంగిక దాడికి గురైనట్టు చెప్పిన ఆమెను సపోర్ట్ చేయడానికే ప్రయత్నించానని ఆయన అన్నారు. ఆమె చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తానని కూడా ఆయన చెప్పాడు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం.. ఇందుకు నేను రెడీ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.
ఈ డెమొక్రటిక్ గవర్నర్ పై లిండ్సే అనే మరో మహిళ కూడా ఆరోపణలు చేసింది. 2015-18 మధ్య కాలంలో ఆమె ఈయన అధికార బృందంలో పని చేసింది. తనను ఎండ్రు లైంగికంగా వేధించినట్టు, అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె ఆరోపించింది. కానీ గవర్నర్ కార్యాలయం ఈమె ఆరోపణలను కూడా తోసిపుచ్చింది.
Also Read:
ఈ కొండ చిలువ ఏం చేస్తుందో చూస్తే షాక్ అవుతారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ..