AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

People March: రైతు కేంద్రంగా కాంగ్రెస్ పోరుబాట.. 6వ రోజుకు చేరిన సీఎల్పీ నేత పీపుల్స్ మార్చ్

క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని డిసైడ్ అయింది తెలంగాణ కాంగ్రెస్. రైతు సమస్యలపై యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుండగా.. రాష్ట్రవ్యాప్త కార్యాచరణకి సిద్ధమవుతోంది.

People March: రైతు కేంద్రంగా కాంగ్రెస్ పోరుబాట.. 6వ రోజుకు చేరిన సీఎల్పీ నేత పీపుల్స్ మార్చ్
Bhatti Vikramarka
Balaraju Goud
|

Updated on: Mar 04, 2022 | 7:25 PM

Share

Congress Party People March: క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని డిసైడ్ అయింది తెలంగాణ(Telangana) కాంగ్రెస్. రైతు(Farmers) సమస్యలపై యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఇప్పటికే సీఎల్పీ నేత(CLP Leader) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పాదయాత్ర చేస్తుండగా.. రాష్ట్రవ్యాప్త కార్యాచరణకి సిద్ధమవుతోంది. రేపటి నుంచే ఆందోళన బాట పట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. తెలంగాణ‌లో రైతు కేంద్రంగా రాజ‌కీయ పోరుబాట చేప‌ట్టాల‌ని నిర్ణయించింది కాంగ్రెస్. అన్నదాతల సమస్యలే అజెండాగా ఉద్యమం ఉద్ధృతం చేయనుంది. ఈ దిశగా ఇప్పటికే సుదీర్ఘంగా చ‌ర్చించిన PCC టాప్‌లీడర్స్ ఏవిధంగా ముందుకెళ్లాల‌నే దానిపై ఒక అజెండాను రూపొందించారు. అధికార టీఆర్ఎస్ చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రైతాంగం ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌ని నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. రుణ‌మాఫీ, పంట‌లసాగు విధానంలో సర్కారు తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌న్నది కాంగ్రెస్ వాదన. అన్నదాతకు భరోసా కల్పించేలా రేప‌టి నుంచి రంగంలోకి దిగాలని టీపీసీసీ నిర్ణయించింది.

రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రేపు వ్యవసాయ క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తిప‌త్రం ఇవ్వనుంది కాంగ్రెస్. ఈ నెల 7న పార్టీ ఎమ్మెల్యేలు, MLCలతోపాటు ముఖ్యనేతలంగా గవర్నర్ తమిళిసైని కలిసి వ్యవసాయ సమస్యలపై వినతి పత్రం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అలాగే.. ఈ నెల 13న కొల్లాపూర్‌లో మన ఊరు- మన పోరు పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వహించనున్నారు. ఈ సభలోనే వ్యవసాయ రంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలు చేయనున్నారు. అలాగే ఈ నెల 20న కామారెడ్డిలో మరో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తున్నారు. కొల్లాపూర్ స‌భ‌లో చేసిన తీర్మానాల‌పై కామారెడ్డి స‌భ‌లో కార్యాచరణ ప్రకటించనున్నారు. అటు CLP లీడర్ భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తూ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు.

BJPతో పోలిస్తే ప్రభుత్వంపై పోరాటంలో కాస్త వెనుకపడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. ఇకపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. రైతు సమస్యలతోనే ఆ పోరాటానికి శ్రీకారం చుడుతోంది. TRSకు అనుకూలంగా ఉన్న రైతులను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది కాంగ్రెస్‌ స్కెచ్‌గా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ప్రజా సమస్యల పరిష్కారానికై… ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 6వ రోజుకు చేరుకుంది. మండలంలోని బాణాపురం, వల్లభి, మల్లారం గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమలులో ఉంటే రాచరిక వ్యవస్థ నడవదని, ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే దుస్థితి ఎందుకని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలను అమలు చేయడం కోసమే, రాజ్యాంగాన్ని మార్చాలని ఇటీవల ప్రకటించిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నాడన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గా వ్యవహరిస్తున్న సుబ్రమణ్య స్వామితో కేసీఆర్ సమావేశం అవ్వడం వెనుక ఇదే కుట్ర దాగి ఉందని వివరించారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న కుట్రలతో దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులను తిప్పికొట్టడానికి లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క్ పిలుపునిచ్చారు.

పాదయాత్రలో కల్లు తాగిన భట్టి ప్రజా సమస్యల పరిష్కారానికై… ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 6వ రోజు మండలంలోని బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో పాదయాత్ర కు తాటి వనాల వద్ద కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రోడ్డు పక్కన వారు వేసుకున్న పాకలోకి CLP నేతను తీసుకెళ్ళారు. గీత కార్మికుడు వత్సవాయి కుటుంబరావు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. భవిష్యత్తులో తమ వృత్తి మనుగడ లేకుండా పోయే ముప్పు ఉందని వివరించారు. ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గళం వినిపించాలని గౌడన్నలు సీఎల్పీ నేత కు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ఏకరువు పెట్టిన తర్వాత గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాలని బ్రతిమిలాడారు. వారి అభిమాన ఒత్తిడికి ఆయన కల్లు రుచి చూశారు.

తామర చీడ తో నష్టపోయిన రైతులు పడుతున్న బాధల పైన రైతుల గొంతుక గా అసెంబ్లీలో తన గళం వినిపిస్తానని భట్టి విక్రమార్క మిర్చి రైతులకు భరోసా ఇచ్చారు. ముదిగొండ మండలం బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి పాదయాత్ర గా వస్తున్న సీఎల్పీ నేతను మార్గమధ్యంలో మిర్చి రైతులు కలిశారు. తమ మిర్చి పంట పొలాల వద్దకు ఆయనను తీసుకువెళ్లారు. రైతు వత్సవాయి వీరబాబు నాగమణి దంపతులు సి ఎల్ పి నేతకు తమ గోడును చెబుతూ బోరున విలపించారు. చావు సమస్యకు పరిష్కారం కాదని మనోధైర్యం కల్పించారు. “తెలంగాణలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని భావించి తెలంగాణ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన నాయకుడిగా మీ సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ మొదలు పెట్టానని” భట్టి తెలిపారు. తన అడుగులో అడుగు వేసి ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టడానికి కదం తొక్కాలని కోరారు.

Read Also…. CM KCR: ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదు.. ఏదైనా ఉంటే చెబుతాం.. రాంచీ‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు