లొంగిపోతారా..? లేపేయమంటారా..తాజా ఎన్ కౌంటర్ అర్థం ఇదేనా..?

దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టుల కంచుకోట అబూజ్‌మడ్‌లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు..పలువురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. దండకారణ్యంలో తమకు తిరుగులేదనుకున్న మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ కంటిన్యూ చేస్తోంది. దాంతో మావోయిస్టులు తెలంగాణవైపు వస్తుండటంతో పోలీసులు అలెర్టయ్యారు.

లొంగిపోతారా..? లేపేయమంటారా..తాజా ఎన్ కౌంటర్ అర్థం ఇదేనా..?
Maoist Encounter Kothagudem Dist
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Sep 06, 2024 | 5:11 PM

దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టుల కంచుకోట అబూజ్‌మడ్‌లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు..పలువురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. దండకారణ్యంలో తమకు తిరుగులేదనుకున్న మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ కంటిన్యూ చేస్తోంది. దాంతో మావోయిస్టులు తెలంగాణవైపు వస్తుండటంతో పోలీసులు అలెర్టయ్యారు. భద్రాద్రికొత్తగూడెంజిల్లా రఘునాథపాలెంకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫారెస్టులో మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు దళ సభ్యులు మృతి చెందారు. వీరందరు పాల్వంచ దళానికి చెందిన మావోయిస్టులు. 15 సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి సాహోసోపేతంగా టీవీ9 బృందం చేరుకుంది. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్, కెమెరామెన్ వెంకట్ అసలు ఏం జరిగిందనే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ మరిచిపోకముందే..తాజాగా తెలంగాణలో జరిగిన ఈ ఘటన మావోయిస్టుల ఉనికిని చాటుతోంది. కేంద్రం ప్రభుత్వం- ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మావోయిస్టులను తీవ్ర ఇబ్బందిపెడుతోంది. దాంతో తెలంగాణవైపు మావోయిస్టులు తరలివస్తున్నారు. 2014లో శృతి, విద్యాసాగర్‌ ఎన్‌కౌంటరే అతిపెద్దది. అయితే పదేళ్ల తర్వాత తెలంగాణలో ఏకంగా ఒక దళాన్నే ఎన్‌కౌంటర్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయుధాలతో మావోయిస్టులు తెలంగాణలో అడుగుపెడితే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ మావోయిస్టులకు కంచుకోట. కొన్నేళ్లుగా దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకొని మావోయిస్టులు రెచ్చిపోయారు. అబూజ్‌మడ్‌పై నజర్‌ పెట్టిన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి పలువురిని ఎన్‌కౌంటర్‌ చేసి వారికి తీవ్రనష్టం కలిగించారు. అక్కడి భద్రతా బలగాల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చేస్తున్నారు. దాంతో తెలంగాణలో బాగా తగ్గిపోయిన మావోయిస్టుల అలజడి మళ్లీ ఉధృతమయ్యే పరిస్థితి నెలకొంది. మిలిటెంట్, కొరియర్‌ వ్యవస్థలను ఏర్పరచుకొనే ప్రయత్నాలు మొదలు పెట్టిన మావోయిస్టులు శాంతిభద్రతలకు సవాల్‌ విసురుతున్నారు. దాంతో గోదావరి దాటొచ్చి దండకారణ్యంలో షెల్టర్‌ తీసుకుంటున్న మావోయిస్టులను మొగ్గలోనే తుంచేస్తోంది పోలీసుశాఖ.

15 సంవత్సరాల తర్వాత తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్

తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరగటం పెను సంచలనమే. గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శృతి విద్యాసాగర్ల మావోయిస్టు పార్టీ వైపు వెళ్లడంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత తెలంగాణలో సైలెంట్ అయిపోయిన మావోయిస్టులు చత్తీస్‌గఢ్ అడవులకు మకాం మార్చారు. అక్కడ పరిస్థితులు మారిపోవటంతో తిరిగి తెలంగాణకు వచ్చిన మావోయిస్టులు తెలంగాణ అడవుల్లో గూడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకే ఎన్‌కౌంటర్‌లో ఒక దళానికి చెందిన అందరూ మరణించడం సంచలనాత్మకంగా భావిస్తున్నారు. లచ్చన్న దళంలో ఉన్న ఆరుగురు మొత్తం ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు మావోయిస్టులకు చేస్తున్న సందేశం ఒక్కటే. పక్క రాష్ట్రం చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై నిర్బంధం ఉంటే తమ ముందు లొంగి పోవాల్సిందిగా తెలంగాణ పోలీసులు మావోయిస్టులను హెచ్చరిస్తున్నారు. మరోవైపు పోలీసుల చర్యతో మావోయిస్టు సైతం అలర్ట్ అయ్యారు. కచ్చితంగా ప్రతీకార చర్యకు మావోయిస్టులో ప్లాన్ చేస్తున్నట్లు భావిస్తూ.. తెలంగాణ పోలీసులు హై అలర్ట్ గా ఉన్నారు. మావోయిస్టు నేత ఆజాద్ విడుదల చేసిన లేఖలో ఖమ్మం జిల్లా మంత్రులను బాధ్యులు చేశారు.

Tv9 Crime Team

Tv9 Crime Team

టీవీ9 సాహసోపేతమైన రిపోర్టింగ్

నెత్తుటి మరకలు, చెట్లకు తూటాలు, నెత్తురోడిన దుస్తులు, స్థావర సంచులు, పాల ప్యాకెట్లు నిత్యవసర వస్తువులు..ఇవి మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన దట్టమైన అటవీ ప్రాంతంలో టీవీ9 బృందానికి కనిపించిన దృశ్యాలు. పోలీసులకు, మావోయిస్టులకు తప్ప భీకరమైన ఈ అడవుల్లోకి మూడో వ్యక్తి వెళ్ళటం సాధ్యం కానీ పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాల నుండి దాక్కునేందుకు వచ్చిన మావోయిస్టులు ఒకవైపు.. మావోయిస్టులను తుదముట్టించేందుకు నిరంతర కుంబింగ్ చేస్తున్న తెలంగాణ పోలీసులు మరోవైపు…వీరి మధ్యలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్ ప్రదేశానికి టీవీ9 బృందం వెళ్ళింది. టీవీ9 బృందం అత్యంత రిస్క్ తో కూడుకున్న సాహసోపేత రిపోర్టింగ్ చేసింది.

టీవీ9 టీమ్ రిపోర్టింగ్ దృశ్యాలు..

అత్యంత కష్టం మీద ఎన్‌కౌంటర్ ప్రదేశానికి టీవీ9 బృందం చేరుకుంది. ఇక్కడ టీవీ9 కు ముందుగా మావోయిస్టుల సామాగ్రి దర్శనమిచ్చింది. ముఖ్యంగా దుకాణాల్లో దొరికే చిన్నచిన్న మిక్సర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, పళ్ళు తోముకోవడానికి టూత్ బ్రష్ లు, గుడారాలను ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నల్లటి పట్టాలు టీవీ9 బృందానికి దర్శనం ఇచ్చాయి. అడవిలోకి టీవీ9 అడుగుపెట్టగానే కొన్ని కవర్లు కనిపించాయి. వీటిలో ఈ తిను బండారాలను టీవీ9 బృందం గుర్తించింది. నెల రోజులపాటు తాము నివసించేందుకు కావలసిన సామాగ్రి మొత్తాన్ని మావోయిస్టులు సమకూర్చుకున్నట్లు టీవీ9 బృందం గుర్తించింది. మావోయిస్టులు స్పష్టంగా ఇక్కడ నివసించారడానికి కావలసిన ఆధారాలు మొత్తం టీవీ9 కెమెరాకు చిక్కాయి. తినుబండారాలు, కూరగాయలు, జండుబాం బాటిల్స్, టూత్ బ్రష్, దువ్వెన లాంటి వస్తువులు కనిపించాయి.. దట్టమైన అడవిలో మరింత ముందుకు వెళుతున్న టీవీ9 టీంకు కళ్ళు చెదిరే విజువల్స్ లభ్యమయ్యాయి .

మావోయిస్టులకు సంబంధించిన దుస్తులు టీవీ9 కంటపడింది. సాధారణంగా మావోయిస్టులు ధరించేది పచ్చటి దుస్తులే. కానీ వాటిపైన ఉన్న రక్తపు మరకలను టీవీ9 బృందం గుర్తించింది. ఇద్దరూ మావోయిస్టులకు చెందిన దుస్తులను గమనించగా వాటిపై రక్తపు మరకలు స్పష్టంగా కనిపించాయి. అవి పోలీసుల తూటాల నుండి పేలిన బుల్లెట్ మార్కులుగా అర్థమవుతుంది. ఒకే షర్టుపై నాలుగు ఐదు బుల్లెట్ తగిలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా ఇద్దరు మావోయిస్టులకు చెందిన దుస్తులపై దాదాపు పదికి పైగా బుల్లెట్ తగిలిన గుర్తులు వారి చొక్కాలపై కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే చెట్లకు తగిలిన బుల్లెట్ గుర్తులు సైతం కళ్ళకు కట్టినట్లు కనిపించాయి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి