Hyderabad: గ్రేటర్‌ వాసులకు బిగ్‌ రిలీఫ్‌.. కేబీఆర్ పార్కు చుట్టూ 4 ఫ్లైఓవర్లు.. తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ!

హైదరాబాదులో ప్రభుత్వాలు మారిన ట్రాఫిక్ రద్దీ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా నగర నడిబొట్టున ఉండే కేబీఆర్‌ పార్క్ లాంటి ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే.. వర్షం పడిన సందర్భాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గత పది సంవత్సరాల్లో కేబీఆర్‌ పార్క్ మీదగా వెళ్లేటువంటి వాహనాల సంఖ్య మూడింతలు పెరిగింది. ప్రస్తుతం గంటకు 30 వేలకు..

Hyderabad: గ్రేటర్‌ వాసులకు బిగ్‌ రిలీఫ్‌.. కేబీఆర్ పార్కు చుట్టూ 4 ఫ్లైఓవర్లు.. తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ!
KBR Park in Hyderabad
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srilakshmi C

Updated on: Sep 06, 2024 | 5:04 PM

హైదరాబాదు, సెప్టెంబర్‌ 6: హైదరాబాదులో ప్రభుత్వాలు మారిన ట్రాఫిక్ రద్దీ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా నగర నడిబొట్టున ఉండే కేబీఆర్‌ పార్క్ లాంటి ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే.. వర్షం పడిన సందర్భాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గత పది సంవత్సరాల్లో కేబీఆర్‌ పార్క్ మీదగా వెళ్లేటువంటి వాహనాల సంఖ్య మూడింతలు పెరిగింది. ప్రస్తుతం గంటకు 30 వేలకు పైగా వాహనాలు కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రావెల్ చేస్తున్నాయి. దీంతో సాధారణంగానే ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది.

కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు త్వరలో దాని చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించిన డిజైన్లను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు . మొత్తం నాలుగు ఫ్లైఓవర్లను కేబీఆర్‌ పార్క్ చుట్టూ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఫ్లై ఓవర్లు ఆచరణలోకి వస్తే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సమస్య 30% తగ్గే ఆస్కారం ఉంది. ఎందుకంటే దీని మీద గానే అటు ఐటి సెక్టార్లో పనిచేసే ఉద్యోగులు కూడా వెళ్తూ ఉంటారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయి అమల్లోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ట్రాఫిక్ సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ జంక్షన్లో పాదాచారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల వారికి సైతం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సబ్ వే లను నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది . గడచిన పది సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో వెళుతున్న వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. పాదాచారుల కోసం సబ్ వేలను ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లై ఓవర్ తోపాటు సబ్ వేలు నిర్మిస్తే కచ్చితంగా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికినట్లే అని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కేబీఆర్‌ పార్కు చుట్టూ 4 ఫ్లైఓవర్లు.. 4 సబ్‌వేలు ఏర్పాటుకు రంగం సిద్ధం

కేబీఆర్‌ పార్కు ప్రాంతంలో ట్రాఫిక్‌ ఇక్కట్లకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు.. ఈ పార్కు చుట్టూ అత్యంత రద్దీగా ఉన్న ఆరు ప్రాంతాల్లో 4 ఫైఓవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఇందుకు రూ.586 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నాలుగు ఫ్లైఓవర్లలో నాలుగు చోట్ల పాదచారుల కోసం సబ్‌వేలు నిర్మించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.