AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పాత ఇంటిని కూల్చుతుండగా కనిపించిన మట్టి కుండ.. ఏముందా అని తెరిచి చూడగా

ఓ వ్యక్తి తన పాత ఇంటిని కూలగొట్టి.. కొత్తగా నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా జేసీబీ తెప్పించి కూలగొట్టే పనులు చేశాడు. ఇక తవ్వకాలు ప్రారంభించగా.. వారికి మట్టిలో ఏదో తగిలింది. అదేంటి అని తవ్వి చూడగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: పాత ఇంటిని కూల్చుతుండగా కనిపించిన మట్టి కుండ.. ఏముందా అని తెరిచి చూడగా
Representative Image
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 27, 2025 | 9:27 AM

Share

పురాతన కాలం నాటి నాణేలు లభ్యం కావడంతో గ్రామస్తులంతా వచ్చి సిల్వర్ కాయిన్స్ అన్వేషణలో పడ్డారు. ఓ ఇంటిని నిర్మిస్తున్న ప్రాంతంలో పురాతన మట్టి పాత్ర లభించింది. ఆ పాత్రలో వెండి నాణేలు లభ్యమయ్యాయి. మరిన్ని నాణేలు ఉండవచ్చని తవ్వకాలు చేస్తున్నారు స్థానికులు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట గ్రామంలో ఓ వ్యక్తి తన పాత ఇంటిని కూల్చి వేసి చదును చేస్తున్న క్రమంలో ఒక చిన్న గురిగిలో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం అయ్యాయి. ఇక ఈ విషయం ఊరంతా తెలియడంతో ఊరు ఊరంతా చిన్నా, పెద్ద అని తేడా లేకుండా వచ్చి వెండి నాణేలు వేటలో పడ్డారు. 15, 20 వెండి నాణాలు దొరకడంతో వాటిని తీసుకెళ్లి ఇంట్లో భద్రపరుచుకున్నారు కొంతమంది వ్యక్తులు.

ఇక ఈ తతంగం మొత్తం పోలీసులకు తెలియడంతో వెండి నాణాలు లభ్యం అయిన స్థలానికి వెళ్లి ఆరా తీశారు. వారి వద్ద నుంచి నాణేలను రికవరీ చేసి, జూలపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే ఈ నాణేలు నిజాం కాలం నాటి ఒక రూపాయిగా తెలుస్తోంది. ఇవన్నీ పాత ఇండ్లు కావడంతో అప్పటి సంపాదన బయటపడుతుంది. ఏది ఏమైనా పురాతన నాణేలు, ఇతర ప్రాచీణ వస్తువులు లభిస్తే తమకు అప్పగించాలని పోలీసులు కోరుతున్నారు.

Follow Us
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌
యూఏఎన్ నెంబర్ లేకపోయినా పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు.. ఎలా అంటే..
యూఏఎన్ నెంబర్ లేకపోయినా పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు.. ఎలా అంటే..
అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!
అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!
భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..
భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..
ఉగాది రోజున మట్టి కుండను కొని ఇలా చేస్తే అలాంటి దోషాలన్ని మాయం
ఉగాది రోజున మట్టి కుండను కొని ఇలా చేస్తే అలాంటి దోషాలన్ని మాయం
ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే..
ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే..
బీకేర్‌ఫుల్‌.. ఇలాచేస్తే ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది జాగ్రత్త!
బీకేర్‌ఫుల్‌.. ఇలాచేస్తే ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది జాగ్రత్త!
మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్
మసాలా ద్రాక్ష ఇలా చేసి తింటే.. ఆ ప్రాణాంతక సమస్య దెబ్బకు పరార్
శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..
శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..
గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్
గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్