AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table 2026 : గెలిచినా మారని ఇంగ్లాండ్ రాత.. డబ్ల్యూటీసీ టేబుల్‌లో భారత్ ఏ స్థానంలో ఉందంటే?

WTC Points Table 2026 : లార్డ్స్ టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై 115 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టిక (WTC 2025-27) లో ఏడో స్థానంలోనే నిలిచింది. న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోగా, భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.

WTC Points Table 2026 : గెలిచినా మారని ఇంగ్లాండ్ రాత.. డబ్ల్యూటీసీ టేబుల్‌లో భారత్ ఏ స్థానంలో ఉందంటే?
Wtc Points Table 2026
Rakesh
|

Updated on: Jun 07, 2026 | 6:31 PM

Share

WTC Points Table 2026 : ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) సైకిల్‌లో ఇంగ్లాండ్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. అత్యంత తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.

న్యూజిలాండ్‌కు గట్టి షాక్

ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం వల్ల న్యూజిలాండ్ జట్టుకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెద్ద నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న కివీస్, ఈ ఓటమితో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ పతనం వల్ల సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు లబ్ధి పొందాయి. సౌతాఫ్రికా రెండో స్థానానికి, శ్రీలంక మూడో స్థానానికి ఎగబాకాయి. న్యూజిలాండ్ పీసీటీ రేటింగ్ కూడా 77.78 శాతం నుంచి ఒక్కసారిగా 58.33 శాతానికి పడిపోయింది.

గెలిచినా ఏడో స్థానంలోనే ఇంగ్లాండ్

న్యూజిలాండ్‌పై ఇంత పెద్ద విజయం సాధించినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోలేకపోయింది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు మొత్తం 9 టీమ్స్ ఉన్న ఈ పట్టికలో ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. అయితే వారి పీసీటీ రేటింగ్ 31.67 నుంచి 37.88 శాతానికి పెరిగింది. దీనివల్ల ఆరో స్థానంలో ఉన్న భారత జట్టుకు ఇంగ్లాండ్ కాస్త దగ్గరైంది. ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేస్తే గనుక టేబుల్‌లో మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఫైనల్ రేసులో నిలిచిన జట్లు

ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను గమనిస్తే గత ఏడాది ఫైనల్ ఆడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లే మొదటి రెండు స్థానాల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఆస్ట్రేలియా 87.50 పీసీటీతో టాప్‌లో ఉండగా, సౌతాఫ్రికా 75.00 పీసీటీతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు 28 పాయింట్లతో సమానంగా నాలుగో స్థానంలో ఉన్నాయి. భారత జట్టు 48.15 పీసీటీతో ఆరో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో ఉండగా, ఒక్క విజయం కూడా లేని వెస్టిండీస్ చివరి స్థానంలో కొనసాగుతోంది.

రెండు రోజుల్లోనే ముగిసిన లార్డ్స్ మ్యాచ్

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్ కైల్ జేమీసన్ 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ 5 వికెట్లతో దెబ్బతీయడంతో ఆ జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు ఎమిలియో గే హాఫ్ సెంచరీ సహాయంతో 226 పరుగులు చేసి, న్యూజిలాండ్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉంచింది. ఛేదనలో కివీస్ జట్టు గస్ అట్కిన్సన్ (5/30) ధాటికి 138 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Follow Us